- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
viral: వీధిలో వెళ్తుండగా బాలుడిపై దాడి చేసిన కోతులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

దిశ, ఫీచర్స్ : ఒంటరిగా వెళ్తున్న పిల్లలపై వీధి కుక్కలు దాడిచేసిన సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ బాలుడిపై కోతులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని కామెంట్లు పెడుతున్నారు.
వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. ఓ బాలుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలోనే ఓ నాలుగు కోతులు ఒకదాని తర్వాత ఒకటి వేర్వేరు వైపుల నుంచి వచ్చి ఒక్కసారిగా అతనిపై దాడిచేస్తాయి. దీంతో ఆ బాలుడు తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో పరుగెడతాడు. అయినా కోతులు వదలకుండా వెంబడించడంతో కింద పడతాడు. ఈ దాడి సమయంలో అక్కడ జనం ఎవరూ లేరు. కానీ కొన్ని క్షణాల తర్వాత బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి కోతులను తరిమేస్తారు. దీంతో వెంటనే తేరుకున్న ఆ బాలుడు లేచి తన ఇంటివైపు పరుగెడుతాడు. కాగా ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధురలో జరిగింది. అక్కడి బృందావన్ కాలనీకి చెందిన మదన్ మోహన్ ఘోరా అనే వ్యక్తి తన ఐదేండ్ల కొడుకు కిషన్‌ను ఏదో తీసుకురావాలని బయటకు పంపగా ఈ ఘటన జరిగింది.