- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bathing tips: స్నానం చేసేటప్పుడు నీళ్లలో వీటిని కలపండి.. చర్మ సమస్యలు దరిచేరవు!

దిశ, ఫీచర్స్: చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, చర్మ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. అయితే, కొన్ని ఇన్‌ఫెక్షన్లు మాత్రం ప్రాణాంతకంగా మారుతాయి. వీటి నుండి శరీరాన్ని కాపాడుకోవాలంటే సహజసిద్ధమైన వాటిని ఉపయోగిస్తే.. సీజనల్ వ్యాధుల నుండి బయటపడవచ్చు. స్నానం చేసేటప్పుడు కొన్నింటిని నీటిలో కలిపి స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అవేంటో ఇక్కడ చదివేయండి.
వేప: వేప నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడానికి సహాయపడతాయి. ఇది మంచి బ్యాక్టీరియా ఏజెంట్‌గా పనిచేస్తుంది. వేపాకు నీటితో స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్యలు దూరమవుతాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు వేప ఆకులతో స్నానం చేయడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.
కళ్లుప్పు: స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును కలిగి బాత్ చేస్తే మచ్చలు తొలగిపోతాయి. ఉప్పు నీటిలో ఉండే ఖనిజాలు చర్మానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి, శరీరానికి మర్దనా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్న వారు ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
తులసి ఆకులు: తులసి మొక్క అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. తులసి ఆకులతో స్నానం చేయడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. మానసిక ఆందోళనలు తగ్గి చెడు ఆలోచనలను దూరం చేస్తుంది. వేడి నీటిలో తులసి ఆకులను మరిగించి స్నానం చేయడం వల్ల సీజనల్ వ్యాధులను దరిచేరనివ్వదు.
పసుపు: పసుపులో ఉండే యాంటీబ్యాక్టీయల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. స్నానం చేసే ముందు నీటిలో కొంచెం పసుపును కలుపుకుని బాత్ చేయడం వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది. మొటిమలు, మచ్చలు పిగ్మెంటేషన్ వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది.
గులాబీ రేకులు: గులాబీ రేకులతో స్నానం చేయడం వల్ల చర్మాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇది స్కిన్‌ని మృదువుగా మార్చి, సువాసనను వెదజల్లేలా చేస్తుంది. గులాబీ రేకులు మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా మారుస్తాయి.
Read More...
Toothache: కూల్ వెదర్ కారణంగా పంటినొప్పి.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం!