- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Memories : మెదడే కాదు.. శరీరంలోని ఈ భాగంలోనూ జ్ఞాపకాలు నిక్షిప్తమవుతాయ్!
దిశ, ఫీచర్స్ : ఏదైనా ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోగలుగుతున్నామంటే.. ఇక్కడ జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. ఇక జ్ఞాపకాలన్నీ కామన్‌గా మెదడు భాగంలో నిక్షిప్తమై ఉంటాయనే విషయం కూడా తెలిసిందే. కానీ తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. శరీరంలోని ఇతర భాగాలు కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం.
కేవలం మెదడు మాత్రమే కాదు, శరీర భాగాల్లోని ఇతర కణాలు కూడా అనుభవాలను, జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తాయని, విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యాన్ని పెంచుతాయని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల పరిశోధనలో తేలింది. వాస్తవానికి మెదడు కణాలు మెమోరీ రిలేటెడ్ జన్యువులను సక్రియం చేస్తాయి. అంటే వాటి నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తాయి. సేమ్ ఇటువంటి ప్రాసెస్ రీరంలోని ఇతర కణాలలో కూడా జరుగుతున్నట్లు పరిశోధనా బృందానికి నాయత్వం వహించిన శాస్త్రవేత్త నికోలాయ్ వెల్లడించారు.
అధ్యయనంలో భాగంగా నాన్ - బ్రెయిన్ కణాలలో జ్ఞాపకశక్తికి సంబంధించిన జన్యువులు ఉన్నాయా? ఉంటే అవి ఎలా యాక్టివేట్ అవుతాయో తెలుసుకోవడానికి ప్రయత్నించిన పరిశోధకులు ఈ సందర్భంగా ప్రోటీన్‌ను ఉపయోగించారు. ఈ సందర్భంగా కణాలలో రసాయన సంకేతాలు పునరావృతం కావడంతో మెదడు పనిచేసే విధంగానే.. వీటిలోని మెమోరీ జన్యువులు కూడా యాక్టివేట్ అయినట్లు కనుగొన్నారు. కాకపోతే ఈ పరిశోధనపై మరికొన్ని విశ్లేషణలు, పరిశీలనలన అనంతరం చివరి నిర్ణయానికి రావాల్సి ఉందని కూడా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తాజా పరిశోధన మెదడు రుగ్మతలకు చికిత్స చేయడంలో కొత్త మార్గాన్ని అందించిందని చెప్తున్నారు. 2018 నాటి పరిశోధనలో కూడా కిడ్నీలను మానవ శరీరంలోని రెండవ మెదడుగు పరిశోధకులు గుర్తించారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.