- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
14ఏళ్లకే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్న బెంగళూర్ బాయ్!
దిశ, ఫీచర్స్ : చాలా మంది పిల్లలు మొబైల్ స్క్రీన్‌లకు బందీలైపోతున్న వేళ.. తొమ్మిదో తరగతి చదువుతున్న అమోఘవర్ష పట్లపాటి మాత్రం వన్యప్రాణులను తన లెన్స్‌లో బంధించడం పట్ల మక్కువ చూపుతున్నాడు. బెంగళూరుకు చెందిన ఈ 14 ఏళ్ల కుర్రాడు స్థానిక చిత్రకళా పరిషత్‌లో 'మోగీ స్టోరీస్' పేరుతో తన చిత్రాలతో కూడిన సోలో ఎగ్జిబిషన్‌ను ఇటీవలే నిర్వహించాడు. ఈ ప్రదర్శనలో తను తీసిన వివిధ అడవి జంతువుల ఫొటోలున్నాయి.
ఫొటోగ్రఫీ, వన్యప్రాణులపై అమోఘవర్షకు అభిరుచి ఏర్పడేందుకు వాళ్ల అమ్మ చైత్రే ప్రధాన కారణం. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో మంచి పట్టున్న చైత్ర, ఆయా జంతువుల ఫొటోలు తీసేందుకు తరుచుగా ప్రయాణాలు చేసేది. ఈ క్రమంలో తనతో పాటు ఉన్న అమోఘవర్షకు కూడా వాటిపై తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. చైత్ర కూడా తన కొడుకు ఇష్టానికి విలువనిచ్చి తన కెమెరాను అతడి చేతిలో పెట్టింది. తొమ్మిదేళ్ల వయసులో కెమెరాను చేతిలోకి తీసుకున్న ఆ చిన్నోడు వన్యప్రాణులను క్యాప్చర్ చేయడం ప్రారంభించాడు.
వన్యప్రాణులను క్చాప్చర్ చేసేందుకు ఓపిక చాలా అవసరం. జంతువులను గుర్తించేందుకు వేచి ఉండాలి. మనం తీసే షాట్ స్పష్టంగా ఉండాలి. జంతువు కదలిక లేదా నిశ్చలత వంటి అంశాలు చూసుకుంటూ ఫొటోగ్రాఫ్స్ కోసం కష్టపడాలి. ప్రతీ జంతువు ఓ విభిన్న అనుభవాన్ని అందిస్తుంది. ఇక పులులను గుర్తించడం, పట్టుకోవడం సులువుగా ఉన్నప్పటికీ, చిరుతపులులను గుర్తించడం, వాటిని కెమెరాలో బంధించడం మాత్రం సవాలే. నాగర్‌హోల్‌లో కేవలం ఒకే నల్ల చిరుతపులి ఉందని గుర్తించడానికి నాకు చాలా నెలలు పట్టింది. ఫ్లెమెన్కోలు కూడా ఒక సవాలుగా నిలిచాయి. వాటి జాడ తెలుసుకునేందుకు కూడా నెలకు పైగా వేచిచూశాను. తెల్లారుజామున 4 గంటలకు నిద్రలేచి, అడవిలోకి వెళ్తాను. జంతువులు వాటి సహజ ఆవాసాల్లో ఉన్నప్పుడు ఫొటో తీసేందుకు ఇష్టపడుతుంటాను. ఆ చిత్రాలు భలే సహజంగా, అత్యద్భుతంగా ఉంటాయి. అమ్మ లైట్లను ఉపయోగించే పద్ధతి, ప్రకృతిని తన కెమెరాలో బంధించే విధానం నాకు చాలా ఇష్టం. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో ఆమె నాకు ప్రేరణ. ఇక వన్యప్రాణుల పరిరక్షణకు కూడా కృషి చేస్తున్నాను.
- అమోఘవర్ష