పీరియడ్ రాకుండా మాత్రలు వాడుతున్నారా? బ్లీడింగ్ అధికం కావచ్చు..

by Javid Pasha |
పీరియడ్ రాకుండా మాత్రలు వాడుతున్నారా? బ్లీడింగ్ అధికం కావచ్చు..
X

దిశ, ఫీచర్స్: సరిగ్గా పీరియడ్ వచ్చే సమయానికే అనుకోకుండా ఏవైనా శుభకార్యాలో, పండుగలో వస్తే రెండుమూడు రోజులపాటు నెలసరి రాకుండా ఉండేందుకు మహిళలు ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. చాలామంది డాక్టర్ల సలహా లేకుండానే సొంతంగా వాడేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ, ఎక్కువసార్లు ఇలా చేస్తే ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

నెలసరి ఎలా ఆగుతుంది?

మహిళల్లో రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడానికి సరైన హార్మోన్ లెవల్స్ దోహదపడతాయి. వీటిలో హెచ్చుతగ్గుల వల్లే పీరియడ్స్ వస్తుంటాయి. శరీరంలో ప్రొజెస్టిరాన్ లెవల్ తగ్గినపుడు గర్భాశయం చుట్టూ ఉన్న పొర తొలిగిపోయి నెలసరి రావడానికి కారణం అవుతుంది. అయితే ఈ పీరియడ్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేసే మాత్రల్లో సింథటిక్ ప్రొజెస్టిరాన్ ఉంటుంది. ఈ కారణంగా పీరియడ్స్ లేటుగా వస్తుంది. అందుకే వాయిదా వేయాలనుకున్న వారు నెలసరి ప్రారంభమయ్యే కంటే మూడు రోజుల ముందు నుంచే వీటిని వేసుకుంటారు. దీనివల్ల కొన్నిసార్లు రెండు వారాల వరకు కూడా పీరియడ్స్ రాకుండా ఆగిపోతాయి. వీటిని వేసుకోవడం తగ్గించిన తర్వాత వారం రోజుల లోపు నెలసరి వస్తుంది.

దుష్ప్రభావాలు

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతీసారి ఇలాగే చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. నెక్ట్స్ టైం పీరియడ్‌లో బ్లీడింగ్ అధికం అవుతుంది. ఈ సమస్య కొంతకాలం అలాగే కొనసాగితే శరీరంలో హార్మన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. కొందరిలో నెలసరితో సంబంధం లేకుండా కూడా బ్లీడింగ్ రావడం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. వక్షోజాల్లో నొప్పి రావడం, మానసిక ఆందోళన పెరగడం, వీటి కారణంగా ఇతర అనారోగ్యాలకు దారితీయడం జరగవచ్చు.

ఇవి కూడా చదవండి:

పెళ్లైన మగవారు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడుతారో తెలుసా?

Next Story

Most Viewed