ఒంటరి తనంతో అనేక ఆరోగ్య సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Anjali |   ( Updated:2023-03-24 05:04:33.0  )
ఒంటరి తనంతో అనేక ఆరోగ్య సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒంటరితనం అనేది అనేక వ్యాధులకు కారణం. మానసిక సమస్యలు, మాదకద్రవ్యాల వ్యసనం, ఆత్మహత్య ధోరణులు, వ్యాధులు, మరెన్నో కారణాలు ఒంటరితనానికి దారితీస్తాయి. ఎందుకంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండాలనుకుంటారని నిపుణులు వెల్లడించారు. తాజాగా.. సామాజిక ఒంటరితనాన్ని అనుభవించే వృద్ధ మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, అలాగే ఒంటరిగా ఉండే రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 27 శాతం పెరిగినట్టు ఇటీవలి అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయన ఫలితాలు జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మీరు ఒంటరిగా ఉండడం వల్ల గుండె జబ్బులు, నిరాశ, ఆందోళన, డయాబెటిస్, అధిక రక్తపోటుకు వంటి రోగాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, ఇష్టమైన వారి మరణం, వైఫల్యం, నేను ఏమి చేయలేననే ఆలోచన ఒంటరితనానికి కారణాలవుతాయి.

డిస్తీమియా కూడా ఒంటరితనానికి ఒక కారణమే. దీనిని పెర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ (పీడీడీ) అని అంటారు. ఇది మానసిక, ప్రవర్తనా రుగ్మత. ఒంటరితనం వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధుల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఇది శారీరక అనారోగ్యం కాదు, కానీ.. దీనితో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకుంటాడు. పీడీడీ దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య సమస్య. ఇది రోజురోజుకి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవం తగ్గడానికి దారితీస్తుంది. క్యాన్సర్ ఒంటరితనం ఒత్తిడి వల్ల హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది. డయాబెటిస్ మెల్లిటస్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బరువు ఎక్కువగా ఉన్నవారికి ఇతరులతో పోల్చితే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒత్తిడి, ఒంటరితనం డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు కనుగొన్నారు.

Read more:

మీ భర్త ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈరోజుల్లో అస్సలు గాజులు ధరించకండి

Advertisement

Next Story