- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Valentine's Day : వాలెంటైన్స్ డే తీరు మారుతోందా?

దిశ, ఫీచర్స్ : ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చిందన్నట్లు రేపటి కోసం వేచి చూస్తున్న హృదయాలెన్నో.. గుండె లోతుల్లో దాగివున్న ప్రేమ భావాలను మనసుకు నచ్చిన మనిషితో పంచుకోవాలని కలలు గంటున్న కళ్లు ఎన్నో.. ఇప్పటికే మొగ్గ తొడిన స్నేహ బంధాలు ప్రేమ కుసుమాలై వికసించాలని ఉత్సాహపడుతున్న యువతీ యువకులెందరో.. ఏదైతేనేం ఇంకొన్ని గంటల్లో ఎందరో ఎదురు చూస్తున్న వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) తలుపుతట్టనుంది.
ఇప్పటికే బయట మార్కెట్లలో, ఆన్‌లైన్ వేదికల్లో ఆ వాతావరణం కనిపిస్తోంది. ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే గ్రీటింగ్స్, గిఫ్ట్స్ వివిధ వస్తువులపై డిస్కౌంట్లు ప్రారంభం అయ్యాయి. తమకు నచ్చిన పద్ధతిలో వాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రేమికులు రెడీ అవుతున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వాలెంటైన్స్ డే ఓన్లీ జంటలకేనా? ప్రేమంటే కేవలం రొమాంటిక్ ఫీలింగ్ మాత్రమేనా? సమాజం దృష్టిలో చాలా వరకు అలాగే ఉంది. కానీ ప్రతీ బంధంలోని ప్రేమ ఉంటుందని భావించడం లేదు. అలా భావిస్తే ప్రేమ వ్యక్తీకరణకు అనే మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.
ప్రేమంటే.. ప్రేమికులు లేదా జంటల మధ్య ఉండేదే అసలైన ప్రేమ అనుకుంటాం. ఇది వాస్తవమే. స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమ బంధం ఎప్పటికీ ప్రత్యేకమే. కానీ వాలెంటైన్స్ డే మాత్రం ఒకప్పటిలా కేవలం ప్రేమికులకు మాత్రమే పరిమితమై లేదిప్పుడు. క్రమంగా దాని పరిధి విస్తరిస్తోంది. ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ప్రత్యేకించి జంటలే కానవసరం లేదు. రొమాంటిక్ సీన్లే మైండ్‌లో గిర్రున తిరగాల్సిన అవసరం లేదు. వ్యక్తుల మధ్య ఉండే వివిధ అనుబంధాలు కూడా ప్రేమను వ్యక్తం చేసేరోజుగా ‘వాలంటైన్స్ డే’ను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
డెఫినేషన్ మారిందా?
‘‘వాలైంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం లవర్స్ కే పరిమితం కాదు. గతంతో పోలిస్తే డెఫినేషన్ మారుతోంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకామె గత లవర్స్ డే రోజున తను ఇంట్లో స్వయంగా తయారు చేసిన స్వీట్లను ఫ్రెండ్స్‌కు పంచింది. దీనిని బట్టి ప్రతీ బంధంలోనూ ప్రేమ ఉంటుందనేది నాకు అర్థమైంది. ఇక అప్పటి నుంచి నేను కూడా వాలంటైన్స్ డేను డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించాను. ప్రతీ వాలంటైన్స్ డే రోజు నేను ‘మన మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా వాలంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకోవాలి’ అని నా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కోరాను. గత వాలంటైన్స్ డే రోజు నా తల్లిదండ్రులను ప్రేమతో హగ్ చేసుకోవడం, వారితో మరింత ప్రేమగా ఉండటం చేశాను’’ అంటున్నారు బెంగుళూరు చెందిన వరూధినీ మెహతా.
సొసైటీలో అలా భావించగలరా?
ఇప్పటికీ మన సొసైటీలో ప్రేమను వ్యక్తుల మధ్య రొమాన్స్‌కు సంబంధించిన రిలేషన్ షిప్‌గానో, అదొక మంచి విషయం కాదన్నట్లుగానో కొందరు భావిస్తుంటారు. ప్రేమించకోవడాన్ని నేరంగా పరిగణించేవారు కూడా పలువురు ఉంటున్నారు. అంతేగాని ప్రేమ కూడా ఒక అవసరమని, శృంగారంతో ముడిపడిందే కాకుండా, శృంగారంతో సంబంధ లేని మానవ సంబంధంగానూ అది ఉండవచ్చునని అర్థం చేసుకోవడంలో కొందరు ఆసక్తి చూపడం లేదంటున్నారు నిపుణులు.
వాలెంటైన్స్ డే రోజు ప్రేమ అంటేనే స్త్రీ, పురుషుల మధ్య రొమాన్స్ లేదా రిలేషన్‌షిప్ అని బేసిగ్గానే అంచనా వేస్తుంటారు పలువురు. కానీ ప్రతీ సంబంధాన్ని ప్రేమ పూరితమైనదిగా అంగీకరించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఉదాహణకు తల్లదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని, సిస్టర్స్ బ్రదర్స్ మధ్య కూడా ప్రేమానురాగాలు ఉంటాయి. కానీ ఇక్కడ ‘లవ్’ అని యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. వాలంటైన్స్ డే రోజుల్లో తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ప్రేమను వ్యక్తం చేయడం అనేది దాదాపుగా ఉండదు. ఒకవేళ వాలెంటైన్స్ డే రోజు తండ్రి తన కూతురును హగ్ చేసుకోవడాన్ని, లేదా ఫ్రెండ్స్ హగ్ చేసుకోవడాన్ని సమాజంలో పాజిటివ్‌గా తీసుకునే పరిస్థితి లేదు. మనుషుల మధ్య ప్రేమల వ్యక్తీకరణకు ఈ విధమైన పరిస్థితి ఆటంకంగా ఉంటోందని, అది మారాల్సిన అవసరం ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.
అనేక రూపాల్లో ఉండొచ్చు!
సమస్య ఏమిటంటే.. ఒక నిర్దిష్ట సంబంధంలో ఎలా ప్రవర్తించాలో సమాజం నిర్వచించింది. ఉదాహరణకు వాలెంటైన్స్ డే రోజు తల్లిదండ్రులు, పిల్లలు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం సాధారణ విషయంగా సమాజం పరిగణించదు. సమాజం, సంప్రదాయం ప్రకారం మేజర్లు అయిన పిల్లలు కూడా ప్రేమ వంటి విషయాల్లో తమ తల్లిదండ్రులకు భయపడాలి. ‘చాలా క్లోజ్’ అని స్నేహితులు ఎగతాళి చేసే సినిమాలు మనం చాలా చూశాం. ‘కల్ హో నా హో’లో అమన్, రోహిత్ ఒకే బెడ్‌పై పడుకుని ఒకరినొకరు కౌగిలించుకునే సన్నివేశం గురించి మీకు తెలుసా? అంటే.. ఆమోద యోగ్యమైనదానికంటే ఎక్కువ సాన్నిహితత్వాన్ని సమాజం అంగీకరించదని దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు.
ప్రేమకు నిర్వచనం?
వాలెంటైన్స్ డే రోజు వ్యక్త పరిచే ప్రేమకు ప్రత్యేక నిర్వచనం అంటగట్టే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రేమ కేవలం జంటల మధ్య పంచుకునే శృంగార వ్యవహారంగానే ఉండ కూడదని చెబుతున్నారు. అది ఫ్రెండ్స్ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య వివిధ అనుబంధాలను సెలబ్రేట్ చేసుకునేదిగానూ, వ్యక్తీకరించేదిగానో ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు సైతం. ప్రతీ సంబంధం మధ్య ప్రేమ ఉంటుంది. కానీ వ్యక్తీకరణలో భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. సహజమైన ప్రేమను ‘ఐ లవ్ యూ ’అనే పదంతో వ్యక్తీరించడానికి చాలా మంది భయపడుతుంటారు. ఇది కేవలం జంటలు లేదా ప్రేమికుల మధ్య వ్యక్తీకరణకే అన్నట్లుగా సమాజంలో నాటుకుపోయి ఉంది. అయితే సెక్స్ ఆలోచన లేని ప్రేమ వ్యక్తీకరణగానూ అది ఉంటుందని అంగీకరించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఒకప్పటితో పోలిస్తే వాలెంటైన్స్ డే డెసిషన్ మారుతోందనే చెప్పవచ్చు అంటున్నారు. ప్రేమ వ్యక్తీకరణ ఫలానా వారికే, ఫలానా ఆలోచనతోనే అనేది కాకుండా, దానిని జర్నలైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు పలువురు.