ఒక్కరోజులో చదవగలిగే లైఫ్ చేంజింగ్ బుక్స్.. స్టార్ట్ చేస్తే ఎండ్ అవ్వాల్సిందే...

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-27 17:54:29.0  )
ఒక్కరోజులో చదవగలిగే లైఫ్ చేంజింగ్ బుక్స్.. స్టార్ట్ చేస్తే ఎండ్ అవ్వాల్సిందే...
X

దిశ, ఫీచర్స్ : మంచి పుస్తకం మంచి స్నేహితునితో సమానమని చెప్తుంటారు పెద్దలు. ఇది అక్షరాల సత్యం. కానీ ఈ జనరేషన్ పిల్లలు సోషల్ మీడియాకు ఇస్తున్న ఇంపార్టెన్స్ పుస్తకాలు చదివేందుకు ఇవ్వడం లేదు. అయితే షార్ట్ అండ్ స్వీట్ బుక్స్ పై ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఒక్క రోజులో చదివే లైఫ్ చేంజింగ్ బుక్స్ గురించి సమాచారం మీకోసం.

The Alchemist by Paulo Coelho

గొర్రెలు కాచుకునే బాలుడు తన లైఫ్ పర్పస్ ఏంటి అని వెతికే క్రమంలో సాగే కథ.. చదువుతున్న వాళ్లకు తమ డ్రీమ్స్ చేజ్ చేయాలని, మనసుకు నచ్చిన విధంగా సాగాలని మోటివేట్ చేస్తుంది.

Mindset By Carol Dweck

స్థిరంగా ఉండటం లేదా ఎదుగుదల ఏది బెటర్ చూజ్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉందని చెప్తుంది ఈ పుస్తకం. ఆలోచనా విధానమే మనం ఏ స్టేజ్ లో ఉండాలో డిసైడ్ చేస్తుందని.. సవాళ్లను స్వీకరించడం, కొత్తగా నేర్చుకోవడం పట్ల ప్రేమను పెంచుకుంటే లైఫ్ టర్న్ అవుతుందని వివరిస్తుంది.

Atomic Habits By James Clear

చిన్నవైనా సరే.. స్థిరమైన మార్పులు ఎంత గణనీయమైన ఫలితాలకు దారితీస్తాయో అర్థం చేయిస్తుంది ఈ బుక్. మంచి అలవాట్లను పెంపొందించడానికి, చెడును విచ్ఛిన్నం చేయడానికి ఆచరణాత్మక చిట్కాలను అందిస్తుంది.

The Power Of Positive Thinking By Norman Vincent Peale

సానుకూల ఆలోచన విజయానికి, ఆనందానికి ఎలా దారితీస్తుందో ఈ క్లాసిక్ బుక్ నొక్కి చెప్తుంది. ఒక్క రోజులో చదవగలిగే ఈ పుస్తకం.. మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

The 7 Habits Of Highly Effective People By Stephen Covey

పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదివితే వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లు సులభంగా అధిగమించవచ్చు. ఈ సూత్రాలను ఫాలో అయితే ఎప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed