- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'క్రైయింగ్ రూమ్'.. సినిమా థియెటర్లలో పిల్లలు ఏడిస్తే బయటకు రానక్కర్లేదు!

దిశ, ఫీచర్స్: సాధారణంగా చిన్న పిల్లలను తీసుకుని సినిమాకు వెళ్లేందుకు తల్లిదండ్రులు సంకోచిస్తుంటారు. స్క్రీన్‌పై మూవీ స్ట్రీమ్ అవుతున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేయడం, హై వాల్యూమ్‌కు భయపడిపోయే చిన్నారులు ఏడవడం స్టార్ట్ చేస్తారు. దీంతో పేరెంట్స్ వారిని తీసుకుని మధ్యలోనే బయటకు వచ్చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి అంతరాయం లేకుండా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు హ్యాపీగా సినిమా చూసేందుకు వినూత్న ఏర్పాట్లు చేసింది కేరళకు చెందిన థియేటర్. ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కైరళి-శ్రీ-నిలా థియేటర్ కాంప్లెక్స్ ప్రభుత్వ నిర్వహణలో ఉంది. కాగా ఈ థియేటర్‌లో 'క్రైయింగ్ రూమ్' ఏర్పాటు చేయబడింది.
శిశువుతో సినిమాని ఆస్వాదించాలనుకునే తల్లిదండ్రుల కోసం సౌండ్‌ప్రూఫ్ స్పేస్‌లో కొన్ని కుర్చీలు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అంతేకాదు ఈ గదిలో డైపర్ మార్చే స్టేషన్, ఊయల కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి అంతరాయం లేకుండా సినిమా చూసే ఏర్పాట్లన్ని చేయగా.. కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి వీఎన్ వాసవన్ ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'సినిమా చూస్తూ పాప ఏడుస్తుంటే థియేటర్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు. కెఎస్‌ఎఫ్‌డిసి తిరువనంతపురం కైరలీ థియేటర్ కాంప్లెక్స్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న థియేటర్‌ను మహిళలు, పిల్లలకు అనుకూలంగా మార్చేశాం. ఇందులో భాగంగానే థియేటర్ కాంప్లెక్స్‌లో క్రై రూమ్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSFDC), ఇతర రాష్ట్రాల థియేటర్‌లలో మరిన్ని 'క్రై రూమ్స్' నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మరింత మంది మహిళలు, పిల్లలను థియేటర్లకు స్వాగతించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఒక భాగం' - వీఎన్ వాసవన్, కేరళ మంత్రి