గులాబి రంగు చెరువులో గుండెను తాకే ఆమె మ్యూజిక్ (వీడియో)

by Sumithra |   ( Updated:2022-08-10 07:37:02.0  )
గులాబి రంగు చెరువులో గుండెను తాకే ఆమె మ్యూజిక్ (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సంగీతానికి ప‌ర‌వ‌శించ‌ని జీవంటూ ఉండ‌దు. అందులోనూ అద్భుత‌మైన ప్ర‌కృతి జోడీగా సంగీతం వినిపిస్తుంటే విన‌సొంపుగా, చూడముచ్చ‌ట‌గా ఉంటుంది. ఇలాగే, ఓ 23 ఏళ్ల కజకిస్థాన్ యువ‌తి గులాబీ రంగు నీళ్లున్న స‌ర‌స్సులో కూర్చొని సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కజకిస్తాన్‌లో ఉన్న‌ లేక్ కొబీటుజ్ అనే ఉప్పు సరస్సు ఇలా చాలా సంవత్సరాలకు ఒకసారి గులాబీ రంగులోకి మారుతుంటుంది. ఇలాంటి అద్భుత‌మైన చోట‌, కజఖ్ సంగీత వాయిద్యమైన డోంబ్రాపై శ్రావ్యమైన రాగాలను ప్లే చేస్తున్న‌ ఈ క్లిప్‌ను నార్వే మాజీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మంత్రి ఎరిక్ సోల్‌హీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వ్యూవ్స్ వ‌స్తున్నాయి. "ఇది నా మనస్సును కదిలిస్తోంది," అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వాట్సాప్‌లో న్యూ ప్రైవసీ ఫీచర్స్.. ఆన్‌లైన్‌లో ఎవరికి కనబడాలో డిసైడ్ చేసుకోవచ్చు!

Advertisement

Next Story