కాశ్మీరీ వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి కంటే అంత పవర్ ఫుల్లా..

by Sumithra |
కాశ్మీరీ వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి కంటే అంత పవర్ ఫుల్లా..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీ ఆరోగ్యం సమస్యల్లో పడిపోతుంది. అందుకే చాలామంది ప్రజలు మందులతో పాటు, కొన్ని ఇంటి చిట్కాలను కూడా అనుసరిస్తారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే కాశ్మీరీ వెల్లుల్లిని ఈ విధంగా వాడితే సరిపోతుంది. ఇది అనేక వ్యాధులను అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే, మీరు దీన్ని కొనడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు.

వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు..

కాశ్మీరీ వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. అలాగే దీన్ని తినడం వల్ల అన్ని ఉదర సంబంధిత రుగ్మతలు కూడా నయమవుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు. అంతే కాదు ఇందులో మనిషిని ఆరోగ్యంగా ఉంచే అనేక గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

వెల్లుల్లిని వాడే విధానాలు..

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో రెండు మూడు వెల్లుల్లి మొగ్గలను తీసుకోవచ్చు. అలాగే వంటకాల్లో వేయడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రాత్రిపూట 2 నుండి 3 మొగ్గలు నమిలి మింగినా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. షుగర్‌ని త్వరగా నియంత్రించడంతో పాటు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుందట. దీని రెగ్యులర్ వాడకంతో రక్తం పలచబడుతుందట. వృద్ధులు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed