- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక స్పెషల్ టేస్టీ నిమ్మకాయ రసం చెట్నీ... ఎలా తయారు చేస్తారో చూడండి..
దిశ, ఫీచర్స్ : నిమ్మకాయల పులుపును ఇష్టపడని వారు ఎవరుంటారు. స్పైసీ ఫుడ్స్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా, ఏదైనా స్నాక్స్ లో చాలా మంది నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. అంతే కాదు చాలా మంది నిమ్మకాయతో నిల్వ పచ్చళ్లు కూడా చూసుకుని తింటుంటారు. అలాగే నిమ్మకాయతో ఇప్పుడు మరో కొత్త రుచి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ స్పెషల్ వంటం నోట్లో పెట్టుకుంటే చాలు కారం కారంగా, పుల్లపుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఆ వంటకం ఏంటి అనుకుంటున్నారా అదేనండి కర్నాటకలో ఎక్కువగా ఇష్టపడే నిమ్మకాయ రసం చెట్నీ. ఈ చెట్నీ తయారీకి నిమ్మకాయ రసం, కొబ్బరి, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. మరి ఇప్పుడు కర్ణాటకలోని, మల్నాడు స్టైల్‌లో చేసే నిమ్మకాయరసం చెట్నీ రెసిపీని చూద్దాం. మల్నాడులో ఈ వంటకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చెట్నీని ఒకసారి సిద్ధం చేసిన తర్వాత, కనీసం 1 వారం రిఫ్రిజిరేటర్‌లో ఉంచి కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఆ టేస్టీ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీ విధానం..
ముందుగా, పెరుగులో తాజాగా తురిమిన కొబ్బరి కలపాలి. దీనితో పాటు జీలకర్ర, ఎర్ర మిర్చి, పంచదార, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీరు కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సర్ జార్లో వేయండి. ఇప్పుడు ఈ మొత్తం పదార్ధాన్ని మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేయండి.
ఈ మిశ్రమం తయారయ్యాక ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఒక కప్పు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసి బాగా కలపాలి. మరోవైపు బాణలిలో రెండు, మూడు చెంచాల నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, చింతపండు వేయాలి. ఈ పదార్థాలన్నింటినీ నూనెలో వేసి 2 నుండి 3 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత మిక్సీ పట్టిన పేస్ట్ ను వేడి నూనె పాన్‌లో వేయండి. మీకు కావాలంటే చెట్నీ కొంచెం పల్చగా చేయడానికి కొంచెం నీటిని యాడ్ చేసుకోవచ్చు. కర్ణాటక ప్రసిద్ధ నిమ్మకాయ రసం రెసిపీని ఇంట్లో ఎంత సులభంగా తయారు చేయవచ్చు మీరు చూశారు కదా. ఈ రెసిపీని తెలుసుకున్న తర్వాత, నిమ్మకాయ రసంతో పుల్లని రుచితో మీరు మీ రోజువారీ మెనూలో కొత్త రూపాన్ని ఇవ్వవచ్చు.