- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మీ ఫోన్ స్టోరేజ్ లో అయిందా? ఈ ట్రిక్స్‌తో పెంచేయండి..

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అనేక రకాల సౌకర్యాలను అందిస్తున్నాయి. వినోదం కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన డేటాను నిల్వ చేయడానికి ఉపయోగించబడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ అయిపోవడం చాలా నిరాశపరిచే అంశం. ఎందుకంటే ఇది పరికరాన్ని స్లో చేయడమే కాకుండా.. ఫోన్ హాల్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఇంపార్టెంట్ డేటా తొలగించకుండానే మీ ఫోన్ స్టోరేజ్ పెంచుకునే చిట్కాలు ఇక్కడ చూడండి.
* క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్
చాలా క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులు ఫ్రీ స్టోరేజ్ ఆప్షన్స్ అందిస్తాయి. ఇవి మీ మొబైల్ నుంచి మీ డేటాను రిమూవ్ చేయకుండానే.. తొలగించేందుకు అనుమతిస్తాయి.
ప్రతి Google ఎకౌంట్‌కు Google 15GB ఫ్రీ స్టోరేజ్ అందిస్తుంది. మీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ను Google డిస్క్‌కి అప్‌లోడ్ చేయవచ్చు. మీ డివైజ్‌లో స్పేస్ తీసుకోకుండా వాటిని ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.
* Dropbox.. OneDrive
Google Drive లాగానే... Dropbox, OneDrive కూడా ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తాయి. మీ స్మార్ట్‌ఫోన్ స్పేస్ నింపకుండానే ఫైల్‌లను సులభంగా బ్యాకప్ చేయవచ్చు. అవసరమైనప్పుడు వాటిని యాక్సెస్ చేయవచ్చు.
ఇలా ఈజీగా వినియోగించుకునే క్లౌడ్ స్టోరేజ్ ఎంపికలతో.. కొత్త ఫైల్‌ల కోసం స్పేస్ కల్పించేందుకు ఇకపై ఫైల్‌లను తొలగించాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ స్మూత్‌గా నడుస్తూ.. ఎక్స్‌ట్రా స్పేస్ ఎంజాయ్ చేయొచ్చు.