- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మీ మూత్రంలో నురుగు ఏర్పడుతుందా..? అయితే ఈ సమస్యలు ఉన్నట్టే..!..వాటి నివారణ మార్గాలు..

దిశ, వెబ్‌డెస్క్: సష్టమైన మూత్రం శరీరానికి తగినంత నీరు అందుతోందని తెలియజేస్తుంది. కానీ మేఘంలా కనిపించే లేదా పాల వలె ఉండే మూత్రం డీహైడ్రేషన్, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు (UTI), మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలను సూచించవచ్చు. మూత్రంలో నురుగుకు గల ప్రధాన కారణాలు, పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్:
శరీరంలో తగినంత నీరు లేకపోతే మూత్రం మరీ గాడిగా మారుతుంది. దీని వలన అది పసుపు రంగులోకి మారటమే కాకుండా నురుగు కూడా కనిపించవచ్చు.
నివారణలు.. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి. ఎక్కువ ఉప్పు, కాఫీ, టీ తీసుకోవడం తగ్గించండి. చెమట ఎక్కువగా వచ్చే వేళల్లో నీరు అధికంగా తీసుకోండి.
మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు (UTIలు):
బాక్టీరియా మూత్ర మార్గం లోకి ప్రవేశిస్తే UTI ఏర్పడుతుంది. దీని వలన మూత్రంలో తెల్ల రక్త కణాలు చేరి నురగలా మారుతుంది.
నివారణలు.. ఎక్కువ నీరు తాగి, బాక్టీరియాను బయటకు పంపండి. వేడి నీటితో స్నానం చేయండి, పరిశుభ్రత పాటించండి. విటమిన్ C ఎక్కువగా ఉండే ఫలాలు తీసుకోవడం ద్వారా UTI వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు.
అధిక ప్రోటీన్ (ప్రోటీన్ యూరియా):
మూత్రంలో అధిక ప్రోటీన్ ఉండటం మూత్రాన్ని మేఘంలా మారుస్తుంది. ఇది మూత్రపిండాల సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు.
నివారణలు.. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం తగ్గించండి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం (చికెన్, గుడ్లు, మాంసం) తగ్గించండి. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం తీసుకోండి.
కిడ్నీలో రాళ్లు:
కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు మూత్ర మార్గంలో దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఏర్పడతాయి. దీని వలన మూత్రం నురగలా మారడమే కాకుండా నొప్పి కూడా రావచ్చు.
నివారణలు.. నీరు అధికంగా తాగండి, ముఖ్యంగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మంచివి. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్, మాంసాహారం తగ్గించండి. డాక్టర్ సూచించిన పరీక్షలు చేయించుకోండి.
లైంగిక సంబంధిత వ్యాధులు (STIలు):
క్లామిడియా, గోనోరియా వంటి లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధులు మూత్రాన్ని నురుగ వలె మారుస్తాయి.
నివారణలు.. సంరక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండండి. ఏమైనా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.
మందుల దుష్ప్రభావం:
కొన్ని మందుల వల్ల మూత్రం రంగు మారవచ్చు లేదా మేఘంలా కనిపించవచ్చు.
నివారణలు.. డాక్టర్ సూచనల మేరకు మాత్రమే మందులు వాడండి. ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.