Vastu Shastra: అప్పుల బాధలు పోవాలంటే.. ఇంట్లో ఈ విధంగా చేయండి!

by Prasanna |
Vastu Shastra: అప్పుల బాధలు పోవాలంటే.. ఇంట్లో ఈ విధంగా చేయండి!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ ఒక్కరి ఇంట్లో బీరువాలు ఖచ్చితంగా ఉంటాయి. కొందరు దీనిలో విలువైన సామానులు పెట్టుకుంటారు. మరి కొందరు చీరలు, నగలు, డబ్బును పెడుతుంటారు. ఇవి ఎవరి ఇంట్లో ఉన్నా కూడా ఒక ప్రత్యేక అందాన్ని తెస్తాయి. వీటిని బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, లేదా స్టడీ రూమ్ వంటి వివిధ ప్రదేశాలలో ఉపయోగించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉండే బీరువాను సరైన దిశలో ఉంచితే, లక్ష్మీ దేవి ఆ ఇంట్లో తాండవం చేస్తుంది. అసలు, ఈ బీరువాను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? వీటిలో పెట్టె వస్తువులు ఏంటి? పెట్టకూడని వస్తువులు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం..

ఉత్తర లేదా తూర్పు దిక్కు: ఈ దిశల్లో బీరువాను పెడితే ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా, మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి, ఈ దిశలలో ఉంచడం వలన డబ్బు పెరుగుతుంది.

బీరువా ముఖం: బీరువా మనం తెరిచినపుడు ఉత్తరం వైపు చూస్తుండేలా ఉండాలి. దీని వలన లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

బీరువాలో ఉంచాల్సిన వస్తువులు : బంగారం, వెండి , డబ్బు వంటి విలువైన వస్తువులను ఉంచాలి.

బీరువాలో ఉంచకూడని వస్తువులు : పాత వస్తువులను, చెత్తను అసలు బీరువాలో ఉంచకండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story