ఈ వస్తువులు ఇతరులతో పంచుకుంటున్నారా.. ఇబ్బందుల్లో పడ్డట్లే?

by Jakkula Samataha |
ఈ వస్తువులు ఇతరులతో పంచుకుంటున్నారా.. ఇబ్బందుల్లో పడ్డట్లే?
X

దిశ, ఫీచర్స్ : వస్తువులను షేర్ చేసుకోవడం అనేది చాలా కామన్. చాలా మంది తన ఫ్రెండ్స్, సోదరీ సోదరుల వస్తువులు, బట్టలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని వస్తువులు షేర్ చేసుకోవడం వలన ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందంట. అందువలన ఎలాంటి వస్తువులు షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

గాజులు : మీ స్నేహితులకు కానీ, సోదరలకు కానీ మీ గాజులు అస్సలే ఇవ్వకూడదంట. ఇలా వేసుకున్నా గాజులు వారికి ఇవ్వడం వలన మీ అదృష్టం వారికి ఇచ్చినట్లే అవుతుందంట.

పెన్స్ : మాములుగా చిన్నప్పటి నుంచి పెన్స్ పంచుకోవడం చేస్తుంటారు.అయితే ఇలా పెన్నులను పంచుకోవడం అస్సలే మంచిదికాదంట. పెన్నులను ఇతరులకి ఇస్తే, మీ విజయాన్ని ఇతరులతో పంచుకున్నట్లేనంట.

వాచ్ : వాచ్ బాగుంటే చాలు, మన స్నేహితులు డైరెక్ట్‌గా తీసుకుంటూ ఉంటారు. ఇక మనం కూడా వాచ్‌నే కదా నా స్నేహితుడే కదా అని ఇచ్చేస్తాం. అయితే చేతి వాచ్‌లు ఇతరులకు అస్సలే ఇవ్వకూడదంట. దీని వలన జీవితంలో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందంట.


దిండు : మీకు ఇష్టమైన దిండుని ఎవరితోనూ పంచుకోవద్దు. మీ దిండు ఇంతరులతో పంచుకోవడం వల్ల ఆనందం, శాంతికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇటువంటివి ఎక్కువగా ఎదురవుతాయి. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తే ఇక దాన్ని మీరు వదిలేయడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed