- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మీ కలలో పగిలిన అద్దం కనిపిస్తుందా.. దేనికి సంకేతమో తెలుసా.. ?

దిశ, ఫీచర్స్ : డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కలకి వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఆ కల మీకు శుభ లేదా అశుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ కలలన్నీ భవిష్యత్తు జరగబోయే కొన్ని సంఘటనలను సూచిస్తాయి. కొన్ని కలలు వచ్చినప్పుడు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవచ్చు లేదా కొన్ని చెడు విషయాలను వినవచ్చు. అలాగే మీరు మీ కలలో పగిలిన అద్దాన్ని చూస్తే దానికి అనేక అర్థాలు ఉంటాయి. మరి పగిలిన అద్దం కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. స్వప్న శాస్త్రం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో పగిలిన గాజు లేదా అద్దాన్ని చూడటం..
పగిలిన గాజును లేదా అద్దాన్ని కలలో చూడటం అశుభకరమని కొందరు నమ్ముతారు. స్వప్నంలో ఒకరి మరణాన్ని చూడటం దీర్ఘాయువును సూచిస్తున్నట్టే కలలో పగిలిన అద్దాని చూడటం కూడా అశుభం కాదు అని అది శుభపరిణామంగా భావించాలంటున్నారు పండితులు.
అలాగే కలలో పగిలిన అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తున్నట్లు కనిపిస్తే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. మీకు దగ్గరగా ఉన్నవారు మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చని స్నప్న శాస్త్రం చెబుతుంది. మీరు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని ఈ స్వప్నం చూచిస్తుంది. అలాగే మీ వ్యక్తిగత విషయాలు, బలహీనతలను ఎవరికీ బహిర్గతం చేయకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.
ఇక మీ కలలో అద్దం పగిలినట్టు కనిపిస్తే మీరు పరిమితులను దాటే అవసరం ఉందని సూచిస్తుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కల మీరు మీ కోరికలు, భావోద్వేగాలను బయట పెట్టాలని, బయట పెడతారని చెబుతుంది.
అలాగే కలలో మీ చేతి నుండి అద్దం కిందపడి పగిలినట్టు కనిపిస్తే మీరు మంచి అవకాశాన్ని కోల్పోతున్నారని, కోల్పోతారని చెబుతుంది. మీ జీవితంలో ఏదైనా పెద్ద మార్పు ఆగిపోవచ్చని చెబుతుంది. మీరు జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.