- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీకు కాబోయే భాగస్వామిలో ఈ లక్షణాలను గమనించారా.. పెళ్లి చేసుకోవడం మానేయండి !
దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన తంతు. అమ్మాయికైనా, అబ్బయికైనా పెళ్లి అనేది జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. మీరు ఎవరినైనా ప్రేమించిన, వారి పట్ల ఆకర్షితులైనా వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకోకండి. కచ్చితంగా వారిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే దానికి ముందు కొన్ని విషయాల పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.
ఒక వ్యక్తితో కొంతకాలం ట్రావెల్ చేయడం, జీవితాంతం గడపడంలో తేడా ఉంటుంది. మీరు కొంతకాలం ఎవరితోనైనా ఉండి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే ముందుగా వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మీ భాగస్వామికి ఈ అలవాట్లలో ఏవైనా అలవాటు ఉంటే వెంటనే వారికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు.
1.గర్వం చూపించడం..
మీ భాగస్వామికి మీ కంటే ఎక్కువ డబ్బు ఉంటే వారు మీ ముందు గర్వం చూపించాల్సిన అవసరం లేదు. కొందరికి మొదటి నుంచి చూపించే అలవాటు ఉంటుంది. అలాంటి వారిని కచ్చితంగా గుర్తించాలి. అలాంటి వ్యక్తులు తమ కీర్తి కోసం ఎప్పుడైనా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసే అవకాశాలు ఉంటాయట.
2. అబద్ధాలు చెప్పడం..
అబద్ధం చెప్పే అలవాటు ఎవరికీ నచ్చదు. మీ భాగస్వామి ప్రతి విషయంలో మీతో అబద్ధాలు చెప్పినా లేదా మీకు విషయాలు చెప్పడానికి సంకోచించినా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు అలాంటి వ్యక్తిని ఎప్పటికీ విశ్వసించలేరు. ఈ విధంగా మీ సంబంధం రోజురోజుకు బలహీనపడుతుంది. ఏదో ఒక రోజు విడిపోయే అవకాశం ఉండవచ్చు.
3. తమ గురించి ఆలోచించడం, మాట్లాడటం..
కొంతమందికి తమ గురించి మాత్రమే మాట్లాడే అలవాటు ఉంటుంది. అలాంటి వ్యక్తి మీకు ఎప్పటికీ సపోర్ట్ చేయలేరు. నిత్యం తనను తాను పొగుడుకుంటూ బిజీగా ఉంటారు. అలాంటి వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.