- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Aliens:గ్రహాంతరవాసులు భూమి పైకి వచ్చేది ఆ రోజే.. ఏం చేస్తారో తెలిస్తే అంతా షాక్!?

దిశ,వెబ్‌డెస్క్: గ్రహాంతర వాసులకు సంబంధించిన ఏ విషయమైన ఆసక్తిగా అనిపిస్తుంటుంది. అయితే విశ్వం కోట్లాది ఖగోళ వస్తువులు, నక్షత్రాలు, గ్రహాలతో నిండి ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ విశాలమైన ప్రపంచంలో జీవానికి ఆశ్రయం ఇవ్వగల ఏకైక గ్రహం భూమి(Earth). అయితే ఈ భూమి కాకుండా మనుషులు (Humans) నివసించే గ్రహం ఇంకా ఏదైనా ఉండొచ్చని పలువురు అంటుంటారు. ఇదిలా ఉంటే.. సైంటిస్టులు అనేక విశ్వ రహస్యాలను ఛేదించారు. కానీ గ్రహాంతరవాసుల విషయంలో మాత్రం ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అందుకే సైంటిస్టులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఏలియన్స్‌కు సంబంధించిన ప్రతి విషయం క్యూరియాసిటీని పెంచుతుంది. ఏలియన్స్ జీవం ఉనికిని ఇంకా శాస్త్రీయంగా నిరూపించలేదు. కొందరు శాస్త్రవేత్తలు ఎగిరే వస్తువుల ద్వారా గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తారని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ అనే ఓ వ్యక్తి 2025 సంవత్సరంలో కొన్ని పెను ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రహాంతరవాసుల గురించి కూడా సంచలన విషయాలు బయటపెట్టాడు.
ఇంతకీ ఎల్విస్ థాంప్సన్ ఏం చెప్పారంటే..
గ్రహాంతరవాసులు భూమి పైకి వచ్చే సమయం దగ్గర్లోనే ఉందని చెప్పారు. ఏలియన్స్ భూమి పైకి వస్తే ఏం జరుగుతుందనే అంశంపై కూడా తన అంచనాలు తెలియాజేశారు. అయితే అతను చెప్పిన విషయాలపై పలువురు భయభ్రాంతులకు గురవుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఛాంపియన్ అనే గ్రహాంతరవాసి భూమి పైకి వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో 12వేల మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకువెళుతుంది అని థాంప్సన్ అంచనా వేశాడు. భూమికి హాని కలిగించే ఉద్దేశ్యంతో వచ్చే శత్రు గ్రహాంతరవాసుల గురించి కూడా అతను హెచ్చరించాడు.
సెప్టెంబర్ 19వ తేదీన అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాను ముంచెత్తుతుందని అంచనా వేశారు. నవంబర్ 3వ తేదీన నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దది సెరీన్ క్రౌన్ అని పిలువబడే భారీ సముద్ర జీవి పసిఫిక్ మహాసముద్రంలో దర్శనమిస్తుందని ఆయన పేర్కొన్నాడు. తనను తాను థాంప్సన్ గా పరిచయం చేసుకున్న ఈ వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ ఈయన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు ఇతడి పేరు మీద ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌కి 70 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.