- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేపర్ వ్యాల్యుయేషన్‌లో టీచర్ల బ్లండర్ మిస్టేక్.. 82 మార్కులొస్తే వేసింది 18 మాత్రమే
దిశ, ఫీచర్స్: బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన గోగుల సూర్యనారాయణ కుమారుడు అంజి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదివాడు. ఈ ఏడాది మార్చిలో బత్తలపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్ కేంద్రంగా పబ్లిక్ పరీక్షలు రాశాడు. తెలుగులో 98, హిందీ 89, గణితం 92, భౌతిక శాస్త్రం 87, సాంఘిక శాస్త్రంలో 86 మార్కులు సాధించాడు. అయితే ఇంగ్లిష్‌లో కేవలం 18 మార్కులు వేయడంతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు.
మెరిట్ విద్యార్థిగా మన్ననలు పొందిన అంజి ఫెయిల్ అయ్యాడనగానే ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. మానసికంగా కుదేలైన బాధిత విద్యార్థికి సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ధైర్యం చెప్పి వెంటనే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయించారు. ఈ ఫలితాలు సోమవారం తెలుపగా 100కు 82 మార్కులు వచ్చాయి. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడు ఇన్ని రోజులు మానసిక వేదన అనుభవించాడని తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను కోరారు.