పడుకునే ముందు నెయ్యితో ఇలా చేయండి.. అందం మీ వెంటే ఉంటుంది

by sudharani |
పడుకునే ముందు నెయ్యితో ఇలా చేయండి.. అందం మీ వెంటే ఉంటుంది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఉన్న కాలంలో పొల్యూషన్ కారణంగా ఆరోగ్యంతో పాటు అందం కూడా పాడవుతుంది. మహిళలు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతారు కానీ అందం దగ్గర మాత్రం వెనకడుగు వెయ్యరు. దీంతో మార్కెట్‌లో దొరికె సౌందర్య ఉత్పత్తులను వేలకు వేలు పెట్టి అందం కోసం కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొంతమంది మహిళలకు మాత్రం బయట దొరికే రసాయన ఉత్పత్తులు వినియోగించడం ఇష్టం ఉండదు. ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారికి ఓ మంచి చిట్కా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఓ వస్తువుతోనే మీ అందం మరింత రెట్టింపు అవుతుంది. అది ఏంటో తెలుసుకుందాం..

* ప్రతి ఒక్కరు ఇంట్లో నెయ్యి ఉంటుంది. కానీ కొంత మంది బయట కొనుగోలు చేస్తారు. మరి కొందరు సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకుంటారు.

*ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అయితే అందాన్ని మరింత పెంచుతుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే..?

*కేవలం 5 చుక్కలు నెయ్యిని మీ చేతుల్లోకి తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. తర్వాత చేతులతో సున్నితంగా ముఖాన్ని మర్ధనా చేయాలి. అనంతరం పడుకొని ఉదయాన్నే లేచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

* ఈ విధంగా చేసినట్లయితే మీ ముఖం మృదువుగా మెరిసేలా మారుతుంది.

Advertisement

Next Story