- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆపరేషన్‌లో హిప్నటైజ్.. వైద్యుల సరికొత్త మార్గం మంచికేనా?
దిశ, ఫీచర్స్: ఆపరేషన్స్, సర్జరీలు జరిగే ముందు లేదా జరుగుతున్న సమయంలో, జరిగిన తర్వాత రోగులకు అనస్థీషియా ఇస్తుంటారు. పేషెంట్ ఆ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసే నొప్పి, బాధను తగ్గిస్తుంటారు. అయితే బయాప్సీలు, కోలోనోస్కోపీలు వంటి మెలకువగా ఉండే రోగ నిర్ధారణ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రోగి ఆందోళనను తగ్గించేందుకు వైద్యులు మత్తుమందులను వినియోగించకుండా హిప్నాసిస్‌ను ఉపయోగించడం అప్లికేబుల్‌గా ఉంటుంది.
మత్తుమందులు లేదా నొప్పి మందుల మొత్తాన్ని తగ్గించి.. సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారిస్తుంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో సెల్ఫ్ హిప్నాసిస్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ముఖ్యంగా ఈ విధానం పిల్లల్లో రికవరీని వేగవంతం చేస్తుందని తెలిపారు నిపుణులు.
ఆపరేషన్‌కు ముందు రోగుల ఆందోళన లేదా వైద్య విధానం మరియు ఆసుపత్రి వాతావరణం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ అనస్తీటిస్ట్స్ (RcoA) ఆడియో-గైడెడ్ సెల్ఫ్ హిప్నాసిస్‌ని యూజ్ చేసింది. హిప్నాసిస్ అనేది స్పృహ లేని స్థితి, పెరిగిన విశ్రాంతిని సూచిస్తుంది. మెరుగైన దృష్టి, ఏకాగ్రతను అనుమతిస్తుంది. ఈ మానసిక స్థితిని చేరుకోవడానికి తప్పనిసరిగా ప్రాథమిక సూచనల శ్రేణిని అనుసరించాలి. ఇది వైద్యునిచే రూపొందించబడవచ్చు లేదా ఆడియో రికార్డింగ్‌ల మాదిరిగానే సెల్ఫ్ ప్రొపెల్డ్ కావచ్చు. ఈ స్థితికి చేరుకోవడం ద్వారా వ్యక్తి ఒత్తిడి, ఆందోళనకు దారితీసే పరిస్థితుల ప్రభావాలను తగ్గిస్తుంది.
RcoA ఏప్రిల్ ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను రోగులకు సెల్ఫ్-హిప్నాసిస్ రికార్డింగ్‌లను అందించమని, వైద్య ప్రక్రియకు ముందు వాటిని వినిపించమని కోరింది. హిప్నాసిస్ రికార్డింగ్‌లను వినడం లేదా ఆరోగ్య నిపుణుల ద్వారా స్క్రిప్ట్‌ను చదవడంతోపాటు.. ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి సిబ్బంది హిప్నోటిక్ సూచనలు లేదా కీలక పదబంధాలను కూడా ఉపయోగించవచ్చు. ఈ విధానం అనస్థీషియాకు ప్రత్యామ్నాయం కాదు కానీ శస్త్రచికిత్సకు ముందు ఆందోళనను తగ్గించడంలో విజయవంతంగా పనిచేసిందని తెలిపారు నిపుణులు.
Read More: మరణానికి ముందు బ్రెయిన్ యాక్టివిటీస్.. సంచలనాలు వెల్లడించిన నిపుణులు