Tamarind Pachdi: స్పైసీ స్పైసీ చింతకాయ పచ్చడి తయారీ విధానం.. వేడి వేడి అన్నంలో తింటే..!!

by Anjali |
Tamarind Pachdi: స్పైసీ స్పైసీ చింతకాయ పచ్చడి తయారీ విధానం.. వేడి వేడి అన్నంలో తింటే..!!
X

దిశ, వెబ్‌డెస్క్: చింతకాయతో ప్రయోజనాలు అనేకం. లేత చింతచిగురును కూరల్లో ఉపయోగిస్తారు. చాలా రుచిగా ఉంటుంది. అలాగే చింతకాయతో పులిహోర, పచ్చడి , చింతపిక్కల్ని బిస్కెట్‌ల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ చింతపండు కొలెస్ట్రాల్‌ ను సమతుల్యం చేయడంలో మేలు చేస్తుంది. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇక రక్తపోటుతో బాధపడేవారికైతే ఇదొక మంచి మెడిసిన్. పలు రకాల అల్సర్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న చింతపండుతో చాలా మంది ముద్దపప్పు చేసినప్పుడు తప్పక చారు చేసి కమ్మగా తింటుంటారు. అప్పట్లో చింతచెట్టు కొమ్మను పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు.

చింతకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు..

అరికిలో పచ్చి చింతకాయలు తీసుకోవాలి. వీటితో పాటు పచ్చి మిర్చి 5, జీలకర్ర ఒక స్పూను, పసుపు - అర స్పూను, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, సరిపడ బెల్లం తరుగు, జీలకర్ర - ఒక స్పూను, ఒక స్పూను మినపప్పు, ఆవాలు ఒక స్పూను, 6 ఎండుమిరప కాయలు, సరిపడ సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు తీసుకోవాలి.

తయారీ విధానం..

ముందుగా చింతకాయలను క్లీన్‌గా కడిగి పెచ్చులను తీసి.. ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. వీటితో పాటు అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, సరిపడ సాల్ట్ వేసి మిక్స్ పట్టుకోవాలి. దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత తాళింపు వేయాలి. గ్యాస్ పై కడాయి వేసి.. ఆయిల్ వేసి వేడాయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, పసుపు, మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కడాయిలో వేసి కలపాలి. రెండు నిమిషాలు అలా ఉంచితే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే రుచి బాగుంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు

Advertisement

Next Story