- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home Tips: వీటి గురించి తెలియక మనం ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో?
దిశ, వెబ్ డెస్క్: మన రోజు మొదలైనప్పటి నుంచి మనం ఎదో ఒక పని చేస్తూనే ఉంటాము. అది జాబ్ కానీ, పొలం పనులు కానీ, ఇంట్లో పనులు, వంట పనులు కానీ ఇలా ఏవో ఒకటి చేస్తూ ఉంటాం. వాటిలో వంట చిట్కాలు తెలియకుండా సతమవుతుంటారు.వీటిని తెలుసుకున్నాక ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో.. అనుకుంటారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. మామూలుగా దోసెలు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే వంకాయ ముక్కతో పెనం పై రుద్దండి.
2. గ్రుడ్డు సొనకి ఒక టీ స్పూన్ మైదాపిండి కలిపితే ఆమ్లెట్ పెద్దగా పొంగినట్లుగా వచ్చి చాలా సేపు అలాగే ఉంటుంది.
3. బియ్యం నిల్వ చేసే డబ్బాలో గుప్పెడు పుదీనా ఆకులను గాని లేదా రెండు రెమ్మలు కరివేపాకును గాని వేస్తే పురుగులు పట్టవు.
4. కూరలు వండేటప్పుడు నూనె వేడెక్కగానే చిటికెడు పసుపు వేస్తే కూరలు వాటి సహజ రంగును కోల్పోకుండా ఉంటాయి.
5. వెల్లుల్లి ఫ్రిజ్లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అలాగే పొట్టు కూడా సులువుగా వస్తుంది.