'ఫూల్స్ డే' అంటే చిలిపి ఆటే కాదు.. దాని వెనుక‌ చరిత్ర, ప్రాముఖ్యత ఉంది తెలుసా?!

by Sumithra |   ( Updated:2022-04-01 10:08:26.0  )
ఫూల్స్ డే అంటే చిలిపి ఆటే కాదు.. దాని వెనుక‌ చరిత్ర, ప్రాముఖ్యత ఉంది తెలుసా?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'స్క్రీన్ కుడివైపున ఒక‌ పురుగు బొమ్మ ఉంది చూడండి..! ఏప్రిల్ ఫూల్‌..!! అంటూ చిలిపి ఆట‌లు మ‌నమంతా ఆడే వుంటాము. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొద‌టి తారీఖు వ‌స్తుందంటే అదేదో స‌ర‌దా-సంద‌డి రోజు వ‌స్తున్న‌ట్లే అనుకుంటామంతా. 'ఏప్రిల్ ఫూల్స్ డే'గా ఈ రోజు అందరికి గుర్తే. చిలిపి జోకులతో ఒక‌రు మరొకరిని నవ్వించడానికి ప్రయత్నించినప్పుడు వచ్చే పాజిటివ్ వైబ్‌ని కూడా అంద‌రూ ఇష్టపడతారు. ఈరోజును అడ్డం పెట్టుకొని, చిలిపి చేష్టలు చేస్తూ, కొంద‌రు తప్పించుకుంటారు కూడా. ఇదంతా ఓకే..! అయితే, ఈ 'ఫూల్స్ డే' ఎందుకు సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు? దాని చ‌రిత్ర, ప్రాముఖ్య‌త‌ల గురించి మాత్రం అంద‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. నిజానికి, 'ఏప్రిల్ ఫూల్స్ డే' 1582వ సంవ‌త్స‌రం నాటిదని చ‌రిత్ర‌కారులు చెబుతారు.

ఫ్రాన్స్ దేశం జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారినప్పుడు, 1563లో కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ ఇలాంటి ఓ రోజుకు పిలుపునిచ్చింది. ఈ రోజు చిలిపి ఆట‌లు ఆడటం, ఒకరిపైన ఇంకొకరు ప్రాక్టిక‌ల్‌ జోకులు పేల్చుకోవడం, చివ‌రిలో 'ఏప్రిల్ ఫూల్స్' అంటూ పెద్ద‌గా కేకలు వేయడం వంటి సంప్రదాయం పాటించ‌మ‌ని పిలుపునిచ్చారు. ఈ రోజుకు ఎంత ప్ర‌త్యేక‌త ఉందంటే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా అనే ప్రాంతంలో ఏప్రిల్ ఫూల్స్ డేని పబ్లిక్ హాలిడేగా ప్ర‌క‌టించారంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే! ఇక‌, జూలియన్ నుండి గ్రెగోరియన్‌కి క్యాలెండర్‌ను మార్చడం ప్రారంభించింది ఏప్రిల్ 1న క‌నుక‌ ఈ రోజును ఇలా జరుపుకుంటారు. వాస్త‌వానికి, చాలా దేశాలు, అందులోని ప్ర‌జ‌లు ఇలా గ్రెగోరియ‌న్‌ క్యాలండ‌ర్‌కి మార‌డాన్నివ్య‌తిరేకించారు. ఇలాంటి వారంతా జూలియన్ క్యాలెండర్‌నే అనుసరించ‌సాగారు. కాగా, కొత్త క్యాలెండర్‌ను అంగీకరించి, అమలు చేసిన మొదటి దేశం ఫ్రాన్స్ అయ్యింది.

చరిత్రకారుల ప్రకారం, పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టి, కొత్త క్యాలెండర్ జనవరి 1 నుండి ప్రారంభమవుతుందని 1952లో తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలు ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకోవడం ప్రారంభించారు. అయితే, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టడానికి ముందు, నూతన సంవత్సరాన్ని మార్చి చివరి తేదీన‌ జ‌రుపుకునే వారు. అలా కాకుండా ఏప్రిల్ 1న న్యూ ఇయర్ జరుపుకున్న వాళ్ల‌ను ఆ రోజు వెక్కిరించే వాళ్లు. ఇలాంటి వాళ్లు మూర్ఖులని హైలైట్ చేయడానికి వారి వీపు పైన‌ ఒక కాగితం చేపను తగిలించేవారు. ఇలా, ఏప్రిల్ ఫూల్స్ డే మ‌నుగ‌డ‌లోకి వ‌చ్చింది. యూర‌ప్‌లో మొద‌లైన ఈ సంస్కృతి ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా పాకింది.

Advertisement

Next Story

Most Viewed