- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సముద్రపు రంగులతో 'సంగీతం'!
దిశ, ఫీచర్స్ : వీచే గాలి, రాలే ఆకు, ఎగిసే అల, కురిసే చినుకు.. చివరకు నిశ్శబ్దం కూడా సంగీతాన్ని వినిపించగలదు. ఇలా సృష్టిలో అణువణువునా గమకాల ధ్వనులు నాట్యం చేస్తాయనేందుకు నాసా సైంటిస్ట్ చేసిన ప్రయోగమే నిదర్శనం. అతను సముద్రపు కలర్ డేటాతో మ్యూజిక్ నోట్స్ మిళితం చేస్తూ ఓ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ రూపొందిస్తున్నాడు. ఈ మేరకు తాము డైలీ అధ్యయనం చేసే సముద్ర చిత్రాలతో వీక్షకులకు ఇమ్మెర్సివ్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్తల లక్ష్యం. ఇందుకోసం నాసా సైంటిస్ట్ ర్యాన్ వాండర్‌ములెన్, అతడి సోదరుడు దాదాపు 18 నెలలకు పైగా అవిశ్రాంతంగా కష్టపడ్డారు.
ప్రతీ జీవికి 'భూమి'తో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అలాగే పుడమితో మహాసముద్రానికి గల కనెక్టివిటీని ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ సముద్ర ధ్వనితో ఓ కథ చెప్పాలనుకుంటున్నాడు వాండర్‌ములెన్. ఈ మేరకు ఉరుగ్వే, అర్జెంటీనా సరిహద్దులోని ఉరుగ్వే, పరానా నదుల కలయికతో ఏర్పడిన 'రియో డి లా ప్లాటా' తీరం నుంచి హిందూ మహాసముద్రంలోని ఉప్పెనల వరకు ఈ సముద్ర సంగీతం సాగుతుంది. ఇందుకోసం ఓషన్ కలర్ ఇమేజరీ నుంచి సంగ్రహించిన డేటాను సౌండ్‌తో విలీనం చేసి 'ఓసియోనోగ్రాఫిక్ సింఫోనిక్' సంగీతాన్ని సృష్టించాడు.
spektune.com వెబ్‌సైట్‌లో అందుబాటులో గల ఈ సంగీతాన్ని ఉచితంగా వినవచ్చు. అంతేకాదు ఎవరైనా ఉచితంగా సంగీతాన్ని సృష్టించేందుకు, డేటాను దిగుమతి చేసుకునేందుకు ఇది అనుమతిస్తుంది. వాండర్‌ములెన్ సోదరులు సంగీతాన్ని సృష్టించేందుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం చానెల్స్ నుంచి వచ్చే డేటాను ఉపయోగించారు. మ్యూజిక్ ట్రాక్స్ రూపొందించేందుకు రియో డి ప్లాటా మాత్రమే కాకుండా బేరింగ్, కోరల్ సముద్ర చిత్రాలను కూడా ఉపయోగించారు.
డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి నా సోదరుడు వాండర్‌ములెన్‌కు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నిజానికి కలర్ ప్యాలెట్‌తో మ్యూజిక్ సృష్టించాలనుకోవడం చాలా గొప్ప ఆలోచన. అందువల్లే నా సోదరుడి నుంచి డేటాను పొందిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్రోగ్రమాటిక్ ఇంటర్‌ఫేస్‌ను సృష్టించాను. అది డేటాను మ్యూజిక్ నోట్స్‌గా అనువదిస్తుంది. తర్జుమా చేసిన డేటాను డిజిటల్ ఆడియో వర్క్‌స్టేషన్‌లోకి ఇంపోర్ట్ చేశాను'
జోన్ వాండర్‌ములెన్
మనం ఒక వస్తువును చూస్తున్నప్పుడు కాంతి కళ్లలోకి ప్రవేశించి మన కోన్ కణాలను ప్రేరేపిస్తుంది. మెదడు ఈ కణాల నుంచి వచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటుంది. తద్వారా మనం ఒక వస్తువు రంగును చూడగలుగుతాం. అయితే కాంతి డిటెక్టర్స్ ద్వారా మానవులు చూడగలిగే సామర్థ్యం కంటే ఎక్కువ రిజల్యూషన్‌లో సముద్రపు రంగును గుర్తించగలుగుతాం. ఈ క్రమంలోనే తరంగదైర్ఘ్య భాగాలను సంగ్రహించి వేరు చేశాం. ఈ వైవిధ్యాలను చిత్రంగా అన్వయించే బదులు సోనిక్ అనుభవంలోకి అనువదించగలిగితే మెదడును ఉత్తేజపరిచే సంగీతాన్ని సృష్టించవచ్చని గ్రహించాను. మా ఆడియో ప్రోగ్రామ్ సృష్టి ఆరంభం మాత్రమే. మరిన్ని సంగీత-ప్రేరేపిత చిత్రాలను రూపొందించాలని మేం ఆశిస్తున్నాం. NASA వద్ద సముద్రానికి సంబంధించిన సోనిఫికేషన్స్ మాత్రమే కాదు సౌర వ్యవస్థ కోసం సృష్టించినవి కూడా ఉన్నాయి. అంతకు మించి మరిన్ని మెలోడీల జాబితా కోసం NASA సౌండ్‌క్లౌడ్ పేజీని చూడవచ్చు.
-ర్యాన్ వాండర్‌ములెన్