- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Health Tips : కాలుష్యంవల్ల దగ్గు.. వెంటనే ఉపశమనానికి హోమ్ రెమిడీస్ ఇవిగో..
దిశ, ఫీచర్స్ : వింటర్ వచ్చిందంటే మొత్తం వాతావరణమే మారిపోతుంది. ఉదయం మంచు కురవడం, చల్లటి గాలులు వీయడం ఓ వైపు హ్యాపీనెస్‌ను పెంచితే, మరోవైపు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు కూడా కారణం అవుతుంది. ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా తలెత్తే దగ్గు సమస్యతో కడుపు, పక్కెటెముకలు నొప్పి పుడుతుంటాయి. గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ సందర్భంగా ఆస్పత్రులకు వెళ్తే వేలల్లో ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఇంట్లోనే నయం చేసుకోగల హోమ్ రెమిడీస్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
*అల్లం : కాలుష్యంవల్ల తలెత్తిన దగ్గును తగ్గించడంలో అల్లం ఎఫెక్టి్వ్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చక్కెరలో కలిపి తీసుకున్నా, తేనెలో కలిపి తీసుకున్నా, అల్లం కషాయం తీసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
*తేనె : అలాగే తేనె నేరుగా తీసుకోవడం కూడా కాలుష్యంవల్ల తలెత్తిన దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో డెక్ట్స్‌ట్రో మెథోర్ఫాన్ అనే మూలకం ఉంటుంది కాబట్టి తేనె కఫాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓ చెంచా తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దగ్గు, కఫం సమస్యలు మాయమవుతాయి.
*ఉప్పు నీటితో పుకిలించడం : ఉప్పు నీటితో పుక్కిలించడం కూడా కాలుష్యం వల్ల ఏర్పడిన దగ్గును నియంత్రిస్తుంది. ఇలా చేయడంవల్ల ఊపిరి తిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడుతుంది. గొంతులో గర గర, నొప్పి, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ సాల్ట్ కలిపి రోజుకు రెండు లేదా మూడు సార్లు పుక్కిలించడంవల్ల ఎంతో మేలు జరుగుతుంది.
*ఆవిరి పట్టడం : శ్లేష్మం, దగ్గుతో బాధపడుతున్నట్లయితే ఆవిరి పట్టడం తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి రోజూ రెండు వేడినీటి ఆవిరి పట్టాలి. అందులో కొంచెం పసుపు కూడా వేయవచ్చు. ఇలా 10 నుంచి 15 నిమిషాలు ఆవిరి పడితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
👉Also Read: Aging Habits : అందాన్ని తగ్గిస్తున్న అలాంటి అలవాట్లు.. యవ్వన ఛాయలు కూడా దూరం!