Blood Pressure : బీపీ సమస్యా..? కంట్రోల్లో ఉండాలంటే..

by Javid Pasha |   ( Updated:2025-02-18 14:03:34.0  )
Blood Pressure : బీపీ సమస్యా..? కంట్రోల్లో ఉండాలంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో చాపకింద నీరులా విస్తరిస్తూ అనేకమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో బ్లడ్ ప్రెజర్ ఒకటి. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో ముడిపడి ఉన్నందున బాధితుల్లో ఆందోళనకు కారణం అవుతున్నది. అయితే కొన్ని రకాల ఆహారపు అలవాట్లవల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో చూద్దామా?

* అధిక రక్తపోటు గల కారణాల్లో అధిక ఉప్పువాడటం కూడా ఒకటి. కాబట్టి మీరు తినే ఆహారంలో పరిమితికి మించి వాడొద్దు. అట్లనే పండ్లు, ఆకు కూరలు తినండి. ముఖ్యంగా అరటిపండ్లు, నారింజ, వంకాయ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు అధిక రక్తపోటును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

* శరీరంలో నీటి శాతం తగ్గడం, డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల అధిక రక్తపోటు పెరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి తరచుగా మీ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అందుకోసం సరిపడా నీరు తాగాలి. వేసవిలో అయితే కచ్చితంగా రోజుకూ ఏడెనిమిది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తు్న్నారు.

* పాలు, పాలతో తయారు చేసిన కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పాలు, పెరుగు, మజ్జిగ మెగ్నీషియం కలిగి ఉంటాయి కాబట్టి ఎంతో మేలు చేస్తాయి. అట్లనే గుమ్మడి గింజలు, ఇతర తినగలిగే గింజ ధాన్యాలు కూడా బీపీని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

* జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సోడియం అంటే ఉప్పు అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హెల్తీ ఫుడ్స్ తక్కువ తింటూ జంక్స్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారిలో అధిక రక్తపోటుతోపాటు ఇతర అనారోగ్యాలు త్వరగా సంభవిస్తాయి. అందుకే దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.

*టీ, కాఫీ లు తక్కువగా తాగితే చురుకుదనం పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి కొంత మేలు చేస్తాయి. కానీ అధికంగా తాగితేనే ప్రమాదం. అందులోని కెఫిన్ శరీరంలోపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటుకు తలనొప్పికి కారణం అవుతుంది. అందుకే లిమిట్‌గా తాగాలి. రోజుకు 3 మూడు కప్పులకు మించి తాగకపోవడం మంచిది.

*ధూమపానం, మద్యపానం వంటివి అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. దీంతోపాుట తగినంతగా నిద్రపోవడం వల్ల కూడా నిద్రలేమి దూరమై హార్మోన్ల పనితీరు మెగురు పడి అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే క్వాలిటీ స్లీప్ మంచిదంటున్నారు నిపుణులు.

*రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వ్యాయామాలు లేదా శారీరక శ్రమ లేకపోతే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, జీర్ణం కాని పదార్థాలు కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోవడం వంటివి సంభవిస్తాయి. కొవ్వు రక్త నాళాల్లో పేరుకుపోతే అధిక రక్తపోటుకు, గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ తప్పనిసరి. రోజువారి జీవితంలో పైన పేర్కొన్న అలవాట్లు కలిగి ఉంటే బీపీ పెరిగే అవకాశం ఉండదు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమనాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed