- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదకరంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు.. ఐదేళ్లలో 66 శాతం పెరిగే అవకాశం !
దిశ, ఫీచర్స్: వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇది కీలకమైన గ్లోబల్ వార్మింగ్ థ్రెషోల్డ్‌ను తాకవచ్చునని పేర్కొంది ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ విభాగం. 2023-2027 సంవత్సరాల మధ్య వార్షిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1.5-డిగ్రీ సెల్సియస్ థ్రెషోల్డ్‌ను దాటి, 19వ శతాబ్దం మధ్య కాలం నాటి కంటే 66 శాతం వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. హీట్ ట్రాపింగ్ (వేడి-ఉచ్చు), గ్రీన్‌హౌస్ వాయువులు, సహజంగా సంభవించే ఎల్ నినో వాతావరణ నమూనాల కలయికతో ఈ పరిస్థితి దాపురించవచ్చు.
ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization ) సెక్రటరీ జనరల్ పెట్టెరి తాలస్ (Petteri Taalas) ప్రకారం.. వాతావరణ నమూనా రాబోయే నెలల్లో మారుతూ అభివృద్ధి చెందుతుంది. మానవ ప్రేరిత (human-induced)వాతావరణ మార్పులతో ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతాయి. ఈ పరిస్థితి ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి నిర్వహణ, పర్యావరణానికి విస్తృతమైన చెడు పరిణామాలను కలిగిస్తుంది. అయితే వీటిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉందని యూఎన్ నివేదిక పేర్కొన్నది.
2016లో నెలకొల్పబడిన ఉష్ణోగ్రత రికార్డును రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక్కసారైనా అధిగమించే అవకాశం 98 శాతం ఉందని ప్రపంచ వాతావారణ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే 2015 నాటి పారిస్ వాతావరణ ఒప్పందం కారణంగా ఉష్ణోగ్రత కీలకమైన థ్రెషోల్డ్‌పై ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. ఎందుకంటే ఈ ఒప్పందం ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి అన్ని దేశాలకు మార్గనిర్దేశం చేసే సంఖ్యను సెట్ చేసింది. అయితే అన్ని దేశాలు దీనిని ఫాలో అవుతున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. యూఎన్ ప్రకారం.. వాతావరణ నమూనా, ఎల్ నినో, సాధారణంగా అది అభివృద్ధి చెందిన సంవత్సరం తర్వాత ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతుంది. ఈ కారణంగా 2024 తర్వాత తూర్పు భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున వేడెక్కడాన్ని మనం చూసే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read..