- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మూన్ డస్ట్‌తో గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించవచ్చు!
దిశ, ఫీచర్స్: మూన్ డస్ట్‌ను అంతరిక్షంలోకి పంపడంవల్ల సూర్యుడి వేడి వాతావరణాన్ని అడ్డుకుని భూమికి 'నీడ'గా మారుతుందని, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాక ఈ మూన్ డస్ట్ భౌగోళిక ధూళికంటే తేలికైనది కాబట్టి ఈజీగా అంతరిక్షంలోకి పంపవచ్చని చెప్తున్నారు. శని గ్రహం వంటి కొన్ని గ్రహాలను, చుట్టూ గల వలయాలను ఇందుకోసం వినియోగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. శని గ్రహం చుట్టూ ఉండే పలు ఉపగ్రహాలు, వలయాలు ఖగోళ ధూళితో నిండి ఉన్నాయి. అవి కాంతిని అడ్డుకుని ప్రతిబింబిస్తాయి.
కక్ష్యలోకి పంపడం
మూన్ డస్ట్‌ను సేకరించి భూమికి, సూర్యునికి మధ్య ఉన్న ప్రత్యేక కక్ష్యలోకి పంపించి, అక్కడ దానిని విచ్ఛిన్నం చేస్తే కొద్ది మొత్తంలో గల ద్రవ్యరాశితో సూర్యరశ్మి ప్రభావాన్ని చాలా వరకు నిరోధించగలమని ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ బెన్ బ్రోమ్లీ చెప్పారు. చంద్రుని ఆధారిత ప్రయోగాలకు తగిన సౌకర్యాలు సమకూరిన తర్వాత పెద్ద మొత్తంలో డస్ట్‌ను నిరంతరంగా అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు నిజంగా వాతావరణ మార్పులకు ఇది దోహదపడుతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చెప్పడానికి, వినడానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్‌లా ఉందని కొందరు విమర్శిస్తున్నప్పటికీ.. సాధ్యమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
శిలాజ ఇంధనాలను కాల్చడం ఆపితే..
గ్లోబల్ వార్మింగ్‌ను అడ్డుకోవడంలో మూన్ డస్ట్ గణనీయమైన ప్రభావం చూపాలంటే.. ముందు సూర్యకిరణాల ప్రభావాన్ని 1 నుంచి 2 శాతానికి తగ్గించాలి. ఇందుకుగాను సంవత్సరానికి దాదాపు పది బిలియన్ కిలోల ధూళిని ప్రయోగించవలసి ఉంటుంది. అయితే గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు, ఇప్పటికిప్పుడు ఆకాశంలోకి డస్ట్‌ను పంపాల్సిన అవసరం కూడా లేదు. భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాలు ఎదురైతే ఆలోచించవచ్చు అనే అభిప్రాయాలను సైంటిస్టులు వెల్లడించారు. అయితే గ్లోబల్ వార్మింగ్‌ను, వాతావరణ ప్రతికూలతను నివారించడానికి ప్రస్తుతం శిలాజ ఇంధనాల కోసం తవ్వకాలు జరపడం, ప్రమాదకరమైన ఇంధనాలను కాల్చడం వంటివి ఆపేస్తే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల వాతావరణం వేడెక్కడాన్ని 50 శాతం నివారించవచ్చని సైంటిస్టులు పేర్కొంటున్నారు.