Ghosts: పట్టపగలు జలపాతం దగ్గర 'దయ్యాలు' .. ఎవరూ ఆ నీటిని తాకడానికి ధైర్యం చేయరు?? 5 కోట్ల మంది వీడియో చూసి ఆశ్చర్యపోయారు!

by Prasanna |   ( Updated:2025-01-21 08:10:13.0  )
Ghosts: పట్టపగలు జలపాతం దగ్గర దయ్యాలు .. ఎవరూ ఆ నీటిని తాకడానికి ధైర్యం చేయరు?? 5 కోట్ల మంది వీడియో చూసి ఆశ్చర్యపోయారు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో మనకీ తెలియని వింతలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటికీ ఇక్కడ కొరత లేదు. ఎందుకంటే, మనకీ తెలిసింది కొంచమే .. తెలియాల్సింది చాలా ఉంది. మనం ఇంత వరకు చూడని వస్తువును కానీ, ప్రదేశాన్ని కానీ, మనుషులను కానీ చూసినప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.

మనకు కొన్ని ప్రదేశాల గురించి అస్సలు తెలియదు, ఎందుకంటే అవి మన నివసించే ప్రదేశాల కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది నిజమేనా అని అనుకునేలా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో " ఒక జలపాతం దగ్గర దయ్యాలు ( Ghosts ) కూర్చున్నట్లు మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వారు మాత్రమే ఉండగలరు, సామాన్యులు అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం. వీటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా వాటిని ప్రశంసిస్తారు. ఎందుకంటే ఇది వారి ఆచారం. ప్రపంచానికి వీళ్ళు తెలియకపోవచ్చు కానీ, వారు తమ సొంత ప్రపంచంలో చాలా హ్యాపీగా" ఉన్నారు. ఇంతకీ ఇవి నిజంగానే దయ్యాలా? కాదనేది ఇక్కడ తెలుసుకుందాం..

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో పాపువా న్యూ గినియా నుండి ఓ వ్యక్తి తీశాడు. ఇక్కడ కనిపించే దెయ్యం లాంటి బొమ్మలు నిజానికి తోవై తెగకు చెందిన ఆత్మ పక్షులు. అతను తన క్రిస్మస్ పండుగను వీటితో సంతోషంగా జరుపుకున్నానని తెలిపాడు. అతను " వారిలో ఒకర్ని ఇలా అడుగుతాడు.. నాకు హాని చేయరు కదా అని .. వారు అప్పుడు " ఎలాంటి హాని చేయమని చెప్పినప్పుడు, నిజంగా తన అదృష్టం" అని అతను అంటాడు. అసలు, వీరు ఇక్కడ ఇలా ఎందుకు కూర్చొన్నారంటే " తమ పవిత్ర జలపాతాన్ని రక్షించుకోవడానికి ఒక రక్షకుడిగా ఈ గెటప్ ధరించారు, కాబట్టి బయటి వాళ్ళు ఎవరూ దానిని ముట్టుకోకూడదు" అంటూ అతను పోస్టు లో చెప్పుకొచ్చాడు.

Next Story