- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చలికాలమని గీజర్ వాడుతున్నారా..? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..?

దిశ, వెబ్‌డెస్క్ : పగలు ఎండ.. రాత్రి చలి. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం పరిస్థితి ఇలా ఉంది. నవంబర్ నుంచి శీతాకాలం ప్రారంభం అవుతున్నా.. అక్టోబర్ నుంచే చలి తీవ్రత పెరిగింది. స్కూల్ పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఉదయాన్నే స్నానం చేయాల్సి ఉంటుంది. ఓవైపు చలి, మరోవైపు చల్లటి నీళ్లతో స్నానం చేయాలంటే అందరికీ ఇబ్బందే. ఈ కారణంగా చాలా మంది హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద నీళ్లను హీట్ చేసుకుంటారు. నగరాల్లో ఎక్కువ శాతం బాత్ రూంలో గీజర్‌ను వాడుతారు. గీజర్ ఆన్ చేస్తే చాలు.. వేడివేడిగా పొగలుకక్కే వాటర్ కావాల్సినన్ని వస్తాయి. అయితే ఈ గీజర్‌ను ఎలా పడితే అలా వాడితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. మరి గీజర్‌ను ఎలా వాడాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
* ఏ కంపెనీ గీజర్ కొన్నా అది ISI ప్రమాణాలతో ఉన్నదా లేదా చూడాలి. మంచి బ్రాండ్‌తోపాటు ఎక్కువ రేటింగ్ ఉన్న వాటిని సెలక్ట్ చేసుకోవాలి.
* ఎక్కువ ప్రెజర్‌ని కంట్రోల్ చేసేందుకు, ట్యాంక్ పేలుళ్లను నివారించేలా ప్రెజర్ కంట్రోల్ ఫీచర్ ఖచ్చితంగా ఉండాలి.
* ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ సిస్టమ్‌తో గీజర్‌ని కొనుక్కోవడం ఉత్తమం.
* గీజర్‌ను ఇంజనీర్‌తోనే ఇన్‌స్టాల్ చేయించుకోవాలి. గీజర్‌కు గోడకు మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* బాత్‌రూమ్ కోసం ఎప్పుడూ పెద్ద గీజర్ అంటే 10 నుండి 35 లీటర్ల గీజర్ ఉండేలా చూసుకోండి.
* గీజర్ నుంచి మీథేన్, ప్రొపేన్ వంటి వాయువులు విడుదల అయ్యి కార్బన్ డై ఆక్సయిడ్ గా మారతాయి. అందుకే కచ్చితంగా ఎగ్జాక్ట్ ఫ్యాన్ పెట్టించుకోవాలి.
* గీజర్‌ను 5 నుంచి 10 నిమిషాలు వేస్తే చాలు.. మనకు కావాల్సినంత హీట్ అవుతుంది. అంతేకంటే ఎక్కువ సమయం వేస్తే పేలిపోయే ప్రమాదం ఉన్నది.
* స్నానానికి ముందు గీజర్ ఆన్ చేసుకుని.. హీట్ కాగానే స్వీచ్ ఆఫ్ చేసుకోని బాతింగ్‌కు వెళ్లాలి. గీజర్ స్వీచ్ ఆన్ చేసుకోని అలాగే స్నానం చేస్తే విద్యుత్ ప్రసారం అయ్యే ప్రమాదం ఉంటుంది.
* తడి చేతులతో గీజర్‌ను ఆన్, ఆఫ్ చేయకూడదు. అలా చేస్తే చేతికి ఉన్న తడితో విద్యుత్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది.
* గీజర్‌కు పిల్లలను దూరంగా ఉంచడమే బెటర్. దానిని ఉపయోగించరాకపోతే ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.
* గీజర్ రిపేర్‌కు వస్తే సొంతంగా తెలిసీ తెలియని మెకానిజం చేయకుండా టెక్నికల్ ఇంజనీర్‌తో చేయించడం ఉత్తమం.
ఈ జాగ్రత్తలను పాటిస్తే గీజర్ వాడటం ఉత్తమమే. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో కొత్తగా గీజర్ తెచ్చుకునే వాళ్లు.. ఇప్పటికే వాడుతున్న వాళ్లు పై జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కారం అని నిపుణులు పేర్కొంటున్నారు.