- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇస్నోమియా టు స్లీప్ పెరాలిసిస్.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న 6 డిజార్డర్స్
దిశ, ఫీచర్స్: ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిద్రలేమి సమస్యలను స్లీప్ డిజార్డర్స్ అంటారు. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న మానసిక ఒత్తిడుల కారణంగా ప్రస్తుతం చాలామంది వీటిని ఎదుర్కొంటున్నారు. క్రమంగా ఇవి శారీరక విధులకు ఆటంక కలిగిస్తుంటాయని, ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. గురక మొదలు పక్షవాతం వరకు వ్యక్తులను ప్రభావితం చేసే ఆరు స్లీప్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం.
గురక
అత్యంత సాధారణ నిద్ర రుగ్మతల్లో ఇదొకటి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వ్యక్తులు నిద్రలో ఉన్నప్పుడు తమకు తెలియకుండానే నోరు తెరుచుకొని ఉంటారు. ఒక విధమైన సౌండ్ వస్తుంది. దీనినే గురక పెట్టడం అంటారు. ఈ ప్రాబ్లం ఎక్కువగా పురుషుల్లో, అధిక బరువు ఉన్న అందరు వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది.
స్లీప్ అప్నియా
ఇది రిఫర్ చేయగల మెడికల్ కండిషనింగ్ స్లీప్ డిజార్డర్‌గా డాక్టర్లు పేర్కొంటారు. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో ఒక్కోసారి తాత్కాలికంగా శ్వాస ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బాధితులు భయపడి మేల్కొంటుంటారు. దీనికి చికిత్స తీసుకోకపోతే క్రమంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా పూర్తిగా నిద్రలేమి సమస్య ఏర్పడి ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.
ఇస్నోమియా
ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అత్యంత సాధారణ సమస్యల్లో ఇస్నోమియా లేదా నిద్రలేమిక ఒకటి. దీనిబారిన పడిన బాధితులు పడుకోవడంలో, నిద్ర పోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడుకున్నప్పటికీ నిద్ర పట్టక రకరకాల ఆలోచనలతో డిప్రెషన్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
స్లీప్ వాకింగ్
వైద్య పరిభాషలో స్లీప్ వాకింగ్‌ను పారాసోమ్నియాగా పేర్కొంటారు. అంటే.. బాధిత వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు అవాంఛనీయ ప్రవర్తనకు ఇది దారితీస్తుంది. ఉదాహరణకు తడబాటుకు గురవడం, నిద్రలో మాట్లాడటం, నిద్రలోంచి లేచి నడవడం వంటి ప్రవర్తనలు కనిపిస్తాయి. అయితే ఇవేవీ బాధితులకు తెలియకుండానే జరిగిపోతుంటాయి.
స్లీప్ పెరాలిసిస్
ఇదొక ప్రమాదకరమైన స్లీప్ డిజార్డర్. ఈ సమస్య ఉన్న వ్యక్తులు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు తమ శరీరాన్ని కదిలించలేరు. అంటే బాధితులు మేల్కొని ఉన్నప్పటికీ తాత్కాలికంగా కొద్దిసేపు కదల్లేని పరిస్థితి ఆవహిస్తుంది. ఒళ్లంతా తిమ్మిర్లతో నిండిపోతుంది.
క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్
క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ ప్రధాన లక్షణం సుదీర్ఘమైన అలసట. ఇది ఫుల్ రెస్టు తర్వాత కూడా తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా మానసిక లేదా శారీరక శ్రమతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. రోజువారీ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.
ఏం చేయాలి?
స్లీప్ డిజార్డర్స్ తలెత్తడానికి జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, వృత్తిపరమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు ఇలా రకరకాల కరాణాలు ఉంటాయి. నిద్ర రుగ్మతలు సాధారణంగా వచ్చిపోతుంటాయి. అయితే కొందరిలో అవి నయం కాకుండా తరచుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే క్రమంగా నిద్రలేమి సమస్యతోపాటు, ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి బాధితులు తగిన ట్రీట్మెంట్, మెడికేషన్స్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: గార్డెనింగ్‌తో రిస్క్.. బయటపడే మార్గాలేంటో తెలుసా?