ఇక నుంచి నిద్రలో కనిపించే కలలను కూడా చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

by Prasanna |
ఇక నుంచి నిద్రలో కనిపించే కలలను కూడా  చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్: డ్రీమ్ అనేది మానవుని రహస్య ప్రపంచం. ఇది ఎల్లప్పుడూ మానవాళిని ఆకర్షిస్తుంది. అయితే భవిష్యత్తు ఎదుగుదలకోసం కనే కలలకు, నిద్రలో వచ్చే కలలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తుంటాయి. వాటిలో కొన్నిమంచిగా ఉంటాయి.. కొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. నిజానికి కొన్ని కలలు ఏ పరిస్థితిలో వచ్చాయో కూడా మనకు గుర్తుండదు. మరి నిద్రలో కనిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను రియల్ గా చూసే అవకాశం వస్తే చూడకుండా ఉంటామా.. కచ్చితంగా చూడాలనే అనిపిస్తుంది. కానీ ఇదేలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా..? తమ కలలను చూడాలనుకునే వారి కల నేరవేర్చేందుకు జపాన్ శాస్త్రవేత్తలు అద్భుతమైన పరికరాన్ని ఆవిష్కరించారు.

ఈ మేరకు మనిషి కలలను రికార్డ్ చేసి ప్లే చేయగల డివైజ్ ను జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మన కలల ప్రపంచాన్ని కళ్ల ముందు చూపించనున్నారు. న్యూరోఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పురోగతిపై ఆధారపడిన ఈ పరికరం.. కల స్థితులతో పాటు సంక్లిష్టమైన నాడీ కార్యకలాపాలను సంగ్రహిస్తుంది. నిజంగా తమ కలలను చూసుకున్నపుడు కొందరు సంతోషంగా ఫీల్ అయితే మరికొందరు ఆందోళన చెందినట్లు వెల్లడించారు. ఒక రకంగా ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ కావడం.. గొప్ప విషయమే.. అయినప్పటికీ మరికొన్నిసార్లు ఇలాంటివి ప్రమాదకరమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story