Sting Energy : స్టింగ్ తాగుతున్నారా? ఆకస్మిక మరణం తప్పదు?

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-20 05:45:38.0  )
Sting Energy : స్టింగ్ తాగుతున్నారా? ఆకస్మిక మరణం తప్పదు?
X

దిశ, ఫీచర్స్: చాలా మంది యూత్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. ఆ కిక్ ఎంజాయ్ చేస్తారు. ఇంతకు ముందు రెడ్ బుల్ ఎక్కువగా తీసుకునేవారు కానీ ఈ మధ్య స్టింగ్ అధికంగా సేల్ అవుతున్నట్లు చెప్తున్నాయి నివేదికలు. అయితే తక్షణమే ఎనర్జీ అందిస్తుందని చెప్పబడే ఈ డ్రింక్.. తరుచుగా తీసుకుంటే అనేక రకాలుగా హెల్త్ ఎఫెక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం.

ఈ ఎనర్జీ డ్రింక్ మూర్ఛకు దారితీస్తుంది. దీంతోపాటు రివర్సిబుల్ సెరిబ్రల్ వాసోకాన్స్ట్రిక్షన్(RCVS)కు కారణం అవుతుంది. ఇదొక న్యురాలాజికల్ డిజార్డర్ కాగా తీవ్రమైన తలనొప్పి, బ్రెయిన్ కు బ్లడ్ సప్లై తగ్గిపోయి మెదడులో రక్తం గడ్డ కడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. రాబ్డోమియోలిసిస్ అని పిలువబడే కండరాల గాయం, మయోసైటిస్ తో ముడిపడి ఉంది. జీర్ణాశయంతర వ్యాధులు, కడుపు నొప్పి, హైపర్‌ఇన్సులినిమియా ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు పరిశోధకులు.

NOTE: This Article Is Based On Research/Story Credits To OVERVIEW LIFESTYLE

Advertisement

Next Story

Most Viewed