- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Food habits : ముక్క లేనిదే ముద్ద దిగదు..! మన దేశంలో మాంసాహారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇదే!!
దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే ఎక్కువ మంది శాకాహారులు ఉన్న దేశంగా ఇండియాకు పేరున్నప్పటికీ, ఇక్కడ మాంసాహారులు కూడా అదేస్థాయిలో ఉంటున్నారని 2015 -16 సంవత్సరంలో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-4) సర్వే పేర్కొన్నది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్వే ప్రకారం.. భారత్‌లో దాదాపు 85 శాతం మాంసాహారులు ఉన్నారు. కాగా వారానికి యావరేజ్‌గా 78 శాతం మంది మహిళలు, 70 శాతం మంది పురుషులు నాన్ వెజ్ తప్పకుండా తింటారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే అసలు ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి కూడా ఉందని సర్వే పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.
*నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-4) సర్వే ప్రకారం.. మాంసాహారం ఎక్కువగా తినే ప్రజలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో నాగాలాండ్ మొదటి స్థానంలో ఉంది. కాగా ఇక్కడ 99.8% మంది నాన్ వెజ్‌టేరియన్సే. ఇక రెండవ స్థానంలో బెంగాల్ (99,3%), మూడవ స్థానంలో కేరళ (99.1%) నిలిచాయి. అలాగే రుచికరమైన నాన్ వెజ్ వంటకాల్లోనూ ఈ మూడు రాష్ట్రాలు ముందుంటున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రాల ప్రజలు చేపలు, చికెన్ లేకుండా అస్సలు ఉండలేరట.
*తెలుతు రాష్ట్రాల విషయానికి వస్తే నాన్ వెజ్ ఎక్కువగా తినే రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ 4వ స్థానంలో ఉండగా, ఇక్కడ 98.25% మంది మాంసాహారులే. తెలంగాణలో పురుషులు 98.8%, మహిళలు 98.6% మంది మాంసాహారులుగా ఉంటున్నారు. అంటే ఇక్కడ వెజ్ టేరియన్స్ రాష్ట్ర జనాభా మొత్తంలో కేవలం 2% శాతం మాత్రమే ఉంటున్నారు. మిగతా వారంతా మాంసాహారులే. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు (97.65%)6వ స్థానంలో, ఒడిశా ( 97.35%)7వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పంజాబ్, వరుస క్రమంలో ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. కాగా పంజాబ్‌లో గుడ్లు, చికెన్ తినేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందట. వీరు ప్రొటీన్ కోసం ఎక్కువగా పాలు తాగుతారు. ఆహారం కోసం చేసే ఖర్చులో మూడో వంతు కేవలం పాలకోసమే కేటాయిస్తారు.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు.
Read More...
Best foods: మెగ్నిషియం అధికంగా ఉండే బెస్ట్ ఆహారాలు..!!