- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను కాపాడుతున్న అవిసె గింజలు.. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే..
దిశ, ఫీచర్స్: మారుతున్న జీవనశైలితో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇది వారసత్వంగా రావొచ్చు. లేదా తల్లి అయ్యాక శరీరంలో వచ్చే మార్పుల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. దీంతో రొమ్ములో కణితి మాదిరిగా కాస్త గట్టిగా అనిపించిన మహిళలు హడలిపోతున్నారు. క్యాన్సర్ కావొచ్చనే భయంతో ఆసుపత్రికి వెళ్లడానికి జంకుతున్నారు. అంతేకాదు ఈ రొమ్ము క్యాన్సర్‌లో కూడా రకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అవిసె గింజల(ఫ్లాక్స్ సీడ్స్) గురించి అందరూ వినే ఉంటారు. బరువు తగ్గడం, చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగించే ఇవి.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని ఇటీవలి పరిశోధనలో తేలింది.
* అవిసె గింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ గింజలలో ఔషధ గుణాలతోపాటు, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో లిగ్‌నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.
* మహిళలకు అవసరమైన ఈస్ట్రోజెన్, యాంటీఆక్సిడెంట్లు రెండూ అవిసె గింజలలో పుష్కలంగా ఉన్నాయి. ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్‌నాన్స్ ఈ అవిసె గింజల్లో ఉంటాయి. కాగా ఈ గింజల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్‌కు రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నియంత్రించే గుణం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి.
* అవిసె గింజలు పేగు సూక్ష్మజీవులు, క్షీర గ్రంధుల మైక్రోఆర్ఎన్ఏలను ప్రభావితం చేస్తాయని తెలింది. వాటి ఉపయోగం రొమ్ము క్యాన్సర్‌లో పాల్గొన్న జన్యువులను నియంత్రించడంలో సహాయపడింది. తద్వారా కణాల అనియంత్రిత విస్తరణను తగ్గిస్తుంది.
* మహిళల రొమ్ములో కనిపించే కణితులన్నీ క్యాన్సర్ కాదు. వీటిలో కొన్ని మాత్రమే క్యాన్సర్‌గా మారుతాయి. అయితే ట్యూమర్ కనిపించినట్లు అనిపిస్తే సాధ్యమైనంత తొందరగా వైద్యుల వద్దకు వెళ్లాలి. అమ్మ, అమ్మమ్మలకు రొమ్ము క్యాన్సర్ ఉంటే వాళ్ల పిల్లలకు కేవలం 10 శాతం మాత్రమే వచ్చే వీలుంటుంది. కాని 90 శాతం మాత్రం మద్యం, ఊబకాయం, వయసు మళ్లిన తర్వాత గర్భధారణ, పిల్లలకు పాలు పట్టకపోవడం క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. తొలి దశలో ఉన్నట్లయితే తొందరగానే నివారించవచ్చు. తీవ్రమైనపుడే కష్టంగా ఉంటుంది. కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో క్యాన్సర్ ముప్పు ఉండదు.
* అవిసె గింజలు రక్తపోటును కూడా తగ్గిస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.
* అయితే వీటిని పచ్చిగా తినడం కన్నా... డ్రైరోస్ట్ చేసి, పొడి చేసుకుని తింటే మంచిది. వీటిని వేయిస్తే.. దీనిలోని హానికారక ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మొలకెత్తించి తిన్నా కూడా మంచిదే. ఈ గింజలు నీళ్లలో వేసినప్పుడు కొద్దిగా ఉబ్బి, జెల్లీలా మారతాయి. అంటే ఇవి నీళ్లను ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే వీటిని తిన్న తర్వాత నీళ్లు ఎక్కువ తాగాలి. లేదంటే మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవిసె గింజల ప్రయోజనాలను సంపూర్ణంగా పొందవచ్చు. వీటిని పొడి రూపంలో తినాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రిజ్‌లో దాచిపెట్టాల్సిందే. లేదంటే పోషకాలు త్వరగా పోతాయి.