- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఔట్‌డోర్ వాకింగ్ వర్సెస్ ట్రెడ్‌మిల్ వాకింగ్.. ఏది బెటర్ ?
దిశ, ఫీచర్స్ : హెల్తీ లైఫ్ స్టైల్ కోసం వాకింగ్ ముఖ్యమని అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం జిమ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండటంవల్ల ఆయా వ్యక్తులు తమ ఆసక్తులను బట్టి వ్యాయామ ప్రక్రియలను ఎంచుకుంటున్నారు. కొందరు ఔట్‌డోర్ నడకను కొనసాగిస్తే, మరి కొందరు ట్రెడ్‌మిల్‌పై చేస్తుంటారు. అయితే రెండు రకాల వాకింగ్ పద్ధతులవల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని వ్యత్యాసాలు, అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఫిట్ నెస్ నిపుణులు చెప్తున్నారు. ట్రెడ్ మిల్ వాకింగ్ కంటే కూడా ఆరుబయట నడకవల్ల మేలు జరుగుతుందని చెప్తుండగా.. అదెలాగో తెలుసుకుందాం.
రోజువారీ సింపుల్ ఎక్సర్‌సైజ్‌లలో నడక ఒకటి. ఇది మనకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్, హై బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి రిస్క్‌లను దూరం చేస్తుంది. మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నడకలో ఉన్న గొప్పదనం ఏంటంటే.. ఇది అందరూ పాటించదగిన సులభమైన వ్యాయామం. ఇది ఆరుబయట ప్రకృతిని ఆస్వాదిస్తూ చేయొచ్చు లేదా ట్రెడ్ మిల్ ద్వారా కూడా చేయవచ్చు. ఈ రెండు పద్ధతులు ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ, అవి ప్రకృతిలో ఒకేలా ఉండవని, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ‘ట్రెడ్‌మిల్‌పై నడవడం, బయట నడవడం రెండూ ఒకే ప్రాథమిక కదలికను కలిగి ఉంటాయి. కానీ మీరు పొందే ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయి’ అంటున్నారు. ఔట్‌డోర్ వాకింగ్‌వల్ల అదనపు ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు.
గాలి నిరోధకత లేకపోవడం
మీరు బయట వాకింగ్ చేసినప్పుడు గాలికి వ్యతిరేక దిశలో వెళ్తుంటారు. ఇది మీ వ్యాయామాన్ని మరింత సవాలుగా మార్చి, శారీక శ్రమను పెంచుతుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. అదే ట్రెడ్‌మిల్‌లో అయితే గాలి నిరోధకత ఉండదు. కాబట్టి మీ వ్యాయామం అంత తీవ్రంగా ఉండకపోవచ్చు.
భూభాగ వ్యత్యాసాలు
ఔట్ డోర్ వాకింగ్ అనేది సాధారణంగా ఒక చదునైన, ఏకరీతి ఉపరితలమైన ట్రెడ్‌మిల్ కంటే, వైవిధ్యమైన భూ భాగాన్ని కలిగి ఉంటుంది. కొండలు లేదా అసమాన కాలిబాటలు వంటి వివిధ భూభాగాలపై నడవడం కండరాల కదలికలను ప్రభావితం చేయడం ద్వారా మరింత మెరుగైన వ్యాయామాన్ని అందిస్తుంది.
నాచురల్-ఆర్టిఫిషియల్ మూవ్‌మెంట్స్
బయట నడక స్ట్రైడ్ లెంత్(stride length), కాడెన్స్, ఫుట్ ప్లేస్‌మెంట్‌లో స్వల్ప వ్యత్యాసాలతో సహా మరింత సహజమైన కదలికలను కలిగి ఉంటుంది. అదే ట్రెడ్‌మిల్ ఫ్లాట్ అయితే స్థిరమైన ఉపరితలంవల్ల శరీరంలోని కండరాలన్నీ బయటి నడకతో పోల్చితే తక్కువగా ప్రభావితం అవుతాయి. పైగా ఇది ఆర్టిఫిషియల్ మూవ్‌మెంట్స్‌ను మాత్రమే ఇస్తుండగా ఆరుబయట నడక నేచురల్ మూవ్‌మెంట్స్‌ను అందిస్తుంది.
సైకాలజికల్ ఫ్యాక్టర్స్
ట్రెడ్‌మిల్‌ని ఉపయోగించడం కంటే బయట నడవడంవల్ల చాలా ఎంజాయ్‌బుల్‌గా, మోటివేషనల్‌గా ఉంటుంది. అదీగాక మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ.. విభిన్న దృశ్యాలను చూస్తూ అనుభూతి చెందడం అనేది ట్రెడ్‌మిల్ ద్వారా పొందలేని అదనపు మెంటల్ బూస్ట్‌ను పొందగలుగుతాం.
అమరిక సమస్యలు(Calibration issues)
ట్రెడ్‌మిల్‌లు అమరికలలో కొన్నిసార్లు తేడాలు ఉండవచ్చు. ఇది దూరం, క్యాలరీ రీడింగ్‌ల కచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మీ వర్కౌట్‌లను వేర్వేరు మెషీన్‌లలో లేదా అవుట్‌డోర్ వాకింగ్‌తో పోల్చడం కష్టతరం చేస్తుంది.
ఏది మంచిది?
ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ ఇండోర్ ఎక్సర్‌సైజ్‌కు ప్రతిరూపం. ఇక్కడ మీరు నడక లేదా పరుగును అనుకరించే స్థిరమైన యంత్రంపై కొనసాగుతుంది. ఆరు బయట నడవడంవల్ల డిఫరెంట్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఎగుడు దిగుడు నేలపై వెళ్తుంటాం. ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కుతుంటాం. పార్కులోని దృశ్యాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటాం. దీంతో మనకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేగాక అవుట్‌డోర్ వాకింగ్‌వల్ల స్వచ్ఛమైన గాలి, విభిన్న భూభాగ సవాళ్లను ఎదుర్కోవడం అనేది ట్రెడ్‌మిల్ వాకింగ్‌తో పోల్చినప్పుడు అదనపు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను అందించడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.
Also Read..