పెళ్లిలో తండ్రీకూతుళ్ల హంగామా.. వీడియో వైరల్

by Manoj |   ( Updated:2023-03-30 16:22:32.0  )
పెళ్లిలో తండ్రీకూతుళ్ల హంగామా.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వధూవరులు జంటగా డ్యాన్స్ చేస్తున్న క్లిపింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఓ పెళ్లిలో నవ వధువుతో పాటు ఆమె తండ్రి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

లాస్ ఏంజెల్స్‌కు చెందిన కుషన్ అనే వ్యక్తి, తన కూతురు అనీషా వివాహ వేడుకలో భాగంగా.. ఆమెతో కలిసిన చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. వారిద్దరూ తమ అద్భుతమైన స్టెప్పులతో బంధుమిత్రులను ఆనందంలో ముంచెత్తారు. ముఖ్యంగా హుక్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది. కాగా ఈ వీడియోకు 'తండ్రీ కూతుళ్ల డ్యాన్స్‌లో మా నాన్న బాలీవుడ్ ఐటెం సాంగ్ చేశాడు' అంటూ క్యాప్షన్ ఇచ్చిన పెళ్లికూతురు అనీషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వైరల్‌గా మారిన వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ 'ఇప్పటి వరకు చేసిన డ్యాన్స్ అన్నింటిలో తండ్రీకూతుళ్ల డ్యాన్స్ అత్యుత్తమమైనది' అని హర్షం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed