- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోగ నిరోధక శక్తిని తగ్గిస్తున్న ఉపవాసం.. కంటిన్యూ చేస్తే అంతే సంగతి!

దిశ, ఫీచర్స్: ఉపవాసం దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టగలదని గత అధ్యయనాలు వివరించాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులను నియంత్రిస్తాయని తెలిపాయి. కానీ ఫాస్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందని గుర్తించింది తాజా అధ్యయనం. సాధారణంగా టైమ్‌కు తినే ఎలుకలతో పోలిస్తే 24 గంటల పాటు ఉపవాసం ఉండే ఎలుకలు ఎక్కువ మంటను కలిగి ఉంటాయని, బ్యాక్టీరియా సంక్రమణతో సులభంగా చనిపోయే అవకాశం ఉందని వివరించారు.
ఇందుకోసం మౌంట్ సినాయ్ శాస్త్రవేత్తల బృందం ఐదు ఎలుకలపై ప్రయోగం చేసింది. 24 గంటలు ఉపవాసమున్న ఎలుకల్లో రక్తం, కణజాల నమూనాలను విశ్లేషించారు. ఈ మౌస్ మోడల్స్‌లో సెల్యులార్ స్థాయిలో ఇన్ఫెక్షన్‌తో పోరాడటంపై ఫాస్టింగ్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని గుర్తించారు. ఉపవాసంతో ఉన్న ఎలుకలు ఇన్‌ఫెక్షన్‌తో చనిపోయే ప్రమాదం అధికంగా ఉందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిర్ధారించారు.
Also Read: యూత్ లో సడెన్ ‘స్ట్రోక్’