Sleeping postures : ఆ సమస్యలు వేధిస్తున్నాయా? భంగిమ మార్చండి!

by Javid Pasha |
Sleeping postures : ఆ సమస్యలు వేధిస్తున్నాయా? భంగిమ మార్చండి!
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా, ప్రొడక్టివ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే తగినంత నిద్ర అవసరమనే విషయం తెలిసిందే. నిద్రపోయే భంగిమ సరిగ్గాలేకపోయినా హెల్త్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే రాత్రిళ్లు మీరు పడుకునే తీరును (Sleeping postures) బట్టి కూడా వివిధ రోగాలు, శారీరక నొప్పులను దూరం అవుతాయని చెబుతున్నారు. కాగా సమస్యను బట్టి ఏ విధమైన భంగిమలో పడుకుంటే మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

మెడ నొప్పిగా ఉన్నప్పుడు

మీకు నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటే గనుక రొటీన్ స్లీపింగ్ మోడ్‌ను మార్చాలి. ఆ టైంలో మీ తలను సాధారణంకంటే కాస్త ఎత్తైన దిండుమీద ఆనించి నిద్రపోవడంవల్ల రిలాక్స్ అవుతుంది. ఇలా చేస్తే శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తకపోవడంతోపాటు శబ్దం రాకుండా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది వేధిస్తున్న సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. ఇది నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. ట్రీట్మెంట్‌తో పాటు మీరు పడుకునే భంగిమను మార్చడం ద్వారా రిలాక్స్ అయ్యే అవకాశం ఎక్కువ. డైలీ పడుకునే ముందు మెడకింద ఎత్తైన దిండు వేసుకోకపోవడంవల్ల మెడ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ వేసుకుంటే దిండు మీ భుజానికి సమానమైన ఎత్తులో మాత్రమే ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఇక ఈ సందర్భంలో నిటారుగా పడుకోవడం కొంతకాలం కొనసాగిస్తే మెడనొప్పి తగ్గుతుంది.

వీపును నేలపై ఆనించి..

బ్యాక్ పెయిన్ కూడా చాలా ఇబ్బందికరమైన సమస్య. దీనివల్ల ఏ పనీ చేసుకోలేకపోతారు. కాబట్టి తగిన స్లీపింగ్ మోడ్‌తో దీనికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఏంటంటే.. వెన్ను నొప్పితో బాధపడేవారు నిద్రలో ఇబ్బందికి గురికాకుండా ఉండాలంటే వీపు భాగాన్ని నేలపై ఆనించి ఉండే పొజిషన్‌లోనే పడుకోవాలి. ఈ సందర్భంలో మోకాళ్ల కింది భాగంలో దిండును ఉంచుకోవాలి. ఇది వెన్నెముక సరైన పొజిషన్‌లో ఉండేందుకు సహాయపడుతుంది. ఒక వేళ మీ శరీరాకృతి వల్ల నడుము నేలకు ఆనలేని పరిస్థితి ఉంటే నడుము కింద కూడా చిన్నపాటి దిండు గానీ, మెత్తటి బెడ్‌షిట్ గానీ పెట్టుకోవాలి. వన్‌వీక్ ఈ స్లీపింగ్ మోడ్ పాటిస్తే బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉందంటున్నారు ఆర్థోపెడిక్ నిపుణులు.

మెన్‌స్ట్రువల్ సమయంలో..

ఎసిడిటివల్ల కడుపులో ఉబ్బరంగా అనిపించడం, తరచూ కాళ్లు తిమ్మిర్లు పట్టడం వంటి సమస్యలతో నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారు తల కింద ఒక ఎత్తైన దిండును పెట్టుకోవాలి. ఎసిడిటివల్ల హార్ట్ బర్న్ అనిపించినప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకుంటే రిలాక్స్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కాళ్లు తిమ్మిర్లు పట్టే సమస్యతో బాధపడేవారు రాత్రిపూట పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేసుకోవాలి. నొప్పి నుంచి ఉశమనానికి హాట్ ప్యాడ్ కూడా యూజ్ చేయవచ్చు. మహిళలకు పీరియడ్ టైంలో కడుపులో నొప్పి వల్ల రాత్రిపూట నిద్రపట్టదు. అలాంటప్పుడు నిద్రపోయే భంగిమను మార్చితే ఉపశమనం కలుగుతుందని, నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పక్కకు తిరిగి పడుకుని, మోకాళ్లను ఛాతివైపునకు ముడుచుకొని పడుకుంటే కండరాలపై ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed