మీరు యాక్టివ్‌గా పనిచేయాలా?.. అయితే ఈ హెల్తీ డైట్ ఫాలో అవండి

by Hamsa |   ( Updated:2023-08-07 07:19:36.0  )
మీరు యాక్టివ్‌గా పనిచేయాలా?.. అయితే ఈ హెల్తీ డైట్ ఫాలో అవండి
X

దిశ, ఫీచర్స్: మనం యాక్టివ్‌గా ఉండాలంటే బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని, అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. బ్లడ్, ఆక్సిజన్‌ తగిన మోతాదులో మెదడుకు, శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేయడంలో రక్త నాళాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇదంతా జరగాలంటే కావాల్సిన పోషకాలు కలిగిన ఆహారం, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా లభించే నారింజ, క్యాప్సికమ్, మిరియాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, స్ట్రాబెర్రీలు, పైనాపిల్, మొలకెత్తిన గింజలు కనీసం అప్పుడప్పుడైనా తీసుకుంటూ ఉండాలి. ఇవి బ్లడ్ సర్క్యూట్‌ను పెంచి, రక్తనాళాలను ఉత్తే పరుస్తాయి.

మెడడుకు తగిన పోషకాలు అందించడంతోపాటు జీర్ణక్రియను మెరుగు పర్చడంలో పీచు పదార్థాలు సహాయపడతాయి. ఫైబర్ కంటెంట్ కలిగిన క్యారెట్, బెర్రీలు, బార్లీ, యాపిల్స్, వోట్స్, చియా సీడ్స్, బ్రౌన్ రైస్ వంటివి తరచూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే మీలో చురుకుదనం పెరుగుతుంది. అలాగే ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు కలిగిన ఉల్లిపాయలు, ద్రాక్ష, టమోటా, పాలకూర, బ్రోకలి, యాపిల్, ఆస్పరాగస్, గ్రీన్ టీ వంటివి యాక్టివ్‌నెస్ పెరగడంలో సహాయపడతాయి.

ఇక శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగాలంటే తగినంత నీరు చాలా అవసరం. రక్తం గడ్డకుండా నివారించడంలో, మెదడు, ఇతర శరీర భాగాలకు ఆక్సిజన్‌ను, రక్తాన్ని సరఫరా చేయడంలో నీరే కీ రోల్ పోషిస్తుంది. పైగా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు కనీసం నాలుగు లీటర్ల వరకు సురక్షిత మంచినీటిని తప్పక తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More:

బాదం, కిస్మిస్ కలిపితినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.?

ఇక ఫ్యాటీ‌ఫుడ్ తీసుకున్నా పర్లేదు.. స్లిమ్‌గా మార్చగల కొత్త మెడిసిన్ వచ్చేసింది

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story