- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Sunstroke : వామ్మో.. ఎండలు మండుతున్నాయ్‌గా..! వడదెబ్బ తగలకూడదంటే..

దిశ, ఫీచర్స్ : ‘‘ఓర్నీ.. మార్చిలోనే ఎండలు మండుతున్నాయ్‌గా’’ ప్రస్తుతం బయట చాలామంది నోట వినిపిస్తున్న మాట ఇది. ఇప్పుడే ఇట్లుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటో అంటున్నారు కొందరు. నీడపట్టున ఉండే వారికి పెద్దగా ప్రభావం చూపదు కానీ, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయట తిరిగే వారు మాత్రం ఎండవేడికి తట్టుకోలేక ఇప్పటికే సఫర్ అవుతున్నారు. అయితే ఈ సీజన్‌లో వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. అయితే నిపుణులు ప్రకారం అలా జరగకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
*నీరు ఎక్కువగా తాగాలి : కొందరు తిన్నప్పుడు మాత్రమే వాటర్ తాగి మిగతా సమయాల్లో పట్టించుకోరు. కానీ ఇది డేంజర్. దీనివల్ల శరీరంలో నీటికొరత ఏర్పడి డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. ముఖ్యంగా సమ్మర్‌లో వడదెబ్బ తగిలే చాన్స్ ఉంటుంది. కాబట్టి డైలీ 2 నుంచి 3 లీటర్లు లేదా 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. అట్లనే బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలవేళ ఎండకు ఇబ్బందులు పడటమే కాకుండా దాహం వేస్తుంది. సమయానికి నీరు తాగకపోతే డీహైడ్రేషన్ ఏర్పడే చాన్స్ ఉంటుంది. కాబట్టి జర్నీలో ఉన్నా మీ వెంట ఎప్పుడూ వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.
*ఓఆర్‌ఎస్ ఉండాల్సిందే : అనుకోకుండా అధికదాహం సమస్యలకు దారితీయవచ్చు. ఎండవేడివల్ల తలనొప్పి రావచ్చు. వడదెబ్బకు అవకాశం ఉండొచ్చు. అందుకే సమ్మర్‌లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ప్యాకెట్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. ఎండలో తిరిగినప్పుడు శరీరంలో ఏదైనా తేడా అనిపిస్తే వాటర్‌లో కలిపి తాగవచ్చు. దీంతోపాటు నిమ్మకాయ శర్బత్, లస్సీ, మజ్జిగ, పెరుగు వంటివి కూడా ఎండవేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
*ఈ పండ్లు తినడం బెటర్ : వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వాటర్ మిలన్, బొప్పాయి. నారిజం, ద్రాక్ష, దోస, పైనాపిల్ వంటివి తినడం వల్ల ఎండవేడి ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. బయట తిరిగినప్పుడు వెంటనే వడదెబ్బకు గురికాకుండా శరీరాన్ని తేమగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
*కూలింగ్ క్లాత్స్ : మిగతా సీజన్లకంటే సమ్మర్‌లో ధరించే దుస్తుల విషయంలోనూ కేర్ తీసుకోవాలి. మీరు బయట తిరగాల్సిన పరిస్థితి ఉంటే వదులుగా, సన్నగా ఉండే తేలికైన కాటర్ డ్రెస్సులు వేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇక కలర్స్ విషయానికి వస్తే వైట్ లేదా రంగు ఏదైనప్పటికీ లేతరంగు దుస్తులను ఎంచుకోవాలి.
* ఎండ ప్రభావం పడకుండా : బయటకు వెళ్లేటప్పుడు ఎండవేడి ప్రభావం నేరుగా మీమీద పడకుండా ఉండటానికి గొడుగు, టోపీ, గాగుల్స్ వంటివి ధరించాలి. కాటన్ టవల్ కూడా ఉపయోగించవచ్చు.
* పిల్లలు, వృద్ధులు : వేసవిలో మధ్యాహ్నం పూట వేడిగాలులు వీస్తుంటాయి. బయట తిరిగేవారికి, ఎండలో పనిచేసేవారికి వీటివల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అధిక రక్తపోటుతో బాధపడేవారు, గుండె జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
*అవసరమైతేనే బయటకు రండి : ఎండాకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు బయట తిరగడం కూడా డేంజర్. వేడి గాలులకు సిక్ అయ్యేచాన్స్ ఉంటుంది. వడదెబ్బ తగలవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయట తిరిగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎండపూట నీడపట్టునే ఉండాలి. ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, కొన్నిరకాల శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. కోకోనట్ వాటర్, నిమ్మరసం, పుదీనా వాటర్ వంటివి తీసుకోవడం మంచిది.
*ఈ సౌకర్యాలు ఉన్నాయా? : ఇక ఎండలో పనిచేసే కార్మికులు, కూలీలు మరింత జాగ్రత్త వహించాలి. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి ఒక కప్పు చల్లటి నీళ్లు తాగాలి. పని ప్రదేశాల్లో నీడ ఉండేలా చూసుకోవాలి. యాజమాన్యాలు ఆ విధమైన సౌకర్యాలు కల్పించాలి.
*ఎమర్జెన్సీలో ఇలా : అనుకోకుండా అత్యవసర పరిస్థితి ఏర్పడినా, వడదెబ్బ తగిలినా, అధిక ఉష్ణోగ్రతలతో అవస్థలు, గందరగోళం ఏర్పడినా వెంటనే నీడకు చేరాలి. వెంటనే అంబుల్స్‌కు సమాచారం ఇచ్చి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. మరిన్ని వివరాలకోసం నిపుణులను సంప్రదించగలరు.