Summer Effect : సమ్మర్‌లో ఆ పని చేస్తే అధిక చెమటలు! తర్వాత జరిగేది ఇదే..

by Javid Pasha |   ( Updated:2025-03-12 15:43:04.0  )
Summer Effect : సమ్మర్‌లో ఆ పని చేస్తే అధిక చెమటలు! తర్వాత జరిగేది ఇదే..
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజు వ్యాయామం చేయడం హెల్త్‌కు మంచిదే.. కాకపోతే సమ్మర్‌లోనే జరజాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎక్కువసేపు చేస్తే డీహైడ్రేషన్ బారినపడే చాన్స్ ఉంటుంది. అందుకే అతి వ్యాయామాలు అనర్థదాయకం అంటున్నారు నిపుణులు.

*అసలే ఎండలు మందుతున్నాయ్.. బయటి ఉష్ణోగ్రతలు, బాడీ టెంపరేచర్ అధికంగా సాధారణంగానే పెరుగుతాయి. దీంతో ఎండవేడికి గురైనప్పుడు, ఇంట్లో ఉన్న ఉక్కబోతలతో చెమలు కారుతుంటాయి. ఈ పరిస్థితిలో వర్కవుట్స్ చేయడం మరింత డేంజర్. శక్తిమించి లేదా ఓవర్ టైమ్ చేయడంవల్ల డీహైడ్రేషన్ ఏర్పడి, అవయవాలకు బ్లడ్ సప్లయ్‌లో ఆటంకం ఏర్పడి స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు.

*ఇక సాధారణ వ్యాయామాలు ఎలాగూ చేయాల్సిందే. అయితే ఈ సమయంలో కూడా శరీరం నుంచి చెమట అధికంగా బయటకు పోతుంది. ముఖ్యంగా నీటి శాతంతోపాటు సోడియం లెవెల్స్ త్వరగా తగ్గిపోతుంటాయి. దీని కారణంగా కళ్లు తిరగడం, చూపుల్లో తేడాగా అనిపించడం, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. యూఎస్ డిపార్టెమెంట్ ఆఫఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం అధిక ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అందుకే వేసవిలో ఓవర్ వర్కవుట్స్ అవాయిడ్ చేయాలంటున్నారు నిపుణులు.

READ MORE ...

Sunstroke : వామ్మో.. ఎండలు మండుతున్నాయ్‌గా..! వడదెబ్బ తగలకూడదంటే..




Next Story

Most Viewed