స్ట్రెస్‌కు గురవుతున్నారా? .. మీ కంప్యూటర్‌లో చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉండవచ్చు!

by sudharani |   ( Updated:2023-05-02 13:46:57.0  )
స్ట్రెస్‌కు గురవుతున్నారా? .. మీ కంప్యూటర్‌లో చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉండవచ్చు!
X

దిశ, ఫీచర్స్: మీరు సిస్టమ్‌పై వర్క్ చేస్తున్నారా? కాసేపయ్యాక స్ట్రెస్‌కు గురైనట్లు అనిపిస్తోందా? ఒకసారి మీ కంప్యూటర్ స్ర్కీన్‌పై టూల్ బార్‌ను చెక్ చేయండి. ఎందుకంటే పనిలో భాగంగా మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు అంతకు ముందు క్లిక్ చేసిన సైట్‌ను క్లోజ్ చేయకుండానే ట్యాబ్ నొక్కేసి మరో సైట్‌లోకి వెళ్తుండొచ్చు. అలా అనేక సైట్ల ట్యాబ్స్ టూల్ బార్‌పై క్లోజ్ చేయకుండానే ఉండవచ్చు. దీని కారణంగా మీ మెంటల్ హెల్త్ ప్రభావితం అవుతుందని, స్ట్రెస్‌కు గురవుతారని నిపుణులు చెప్తున్నారు.

కారణాలేమైనా కొందరు తరుచుగా ల్యాప్‌టాప్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ డివైస్‌లకు అతుక్కుపోతుంటారు. తమకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ను కణాల్లో పొందాలనుకుంటారు. కొన్ని సైట్లను ఓపెన్ చేసినప్పుడు అందులో తమకు అవసరమైన సబ్జెక్టు లేదా సమాచారం దొరకదు. కానీ ఆ సందర్భంలో అవసరం లేకపోయినా చదవాలనిపించే ఏదైనా ఇంట్రెస్టింగ్ హెడ్డింగ్, స్టోరీ కనబడవచ్చు. అప్పుడు దానిని క్లోజ్ చేయకుండా ముఖ్యమైన పని అయిపోయాక యాక్సెస్ చేద్దామనుకుని న్యూ ట్యాబ్ క్లిక్ చేసి లేదా బుక్ మార్క్ చేసి అవసరమైన మరో సమాచారం కోసం సెర్చ్ చేస్తుంటారు.

ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు కనిపించి, అనేకసార్లు న్యూ ట్యాబ్ నొక్కి ముందుకెళ్తూ ఉండటంవల్ల సిస్టంలో ఓపెన్ చేసి ఉంచిన సైట్లు పేరుకుపోతుంటాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇలా క్లిక్ చేసి ఉంచడం వల్ల, సిస్టమ్ క్లీన్‌గా లేకపోవడంవల్ల ప్రతీ నలుగురిలో ఒకరు ఏకాగ్రతను కోల్పోతారని, గందర గోళంతో మానసిక ఒత్తిడికి లోనవుతారని ఫిన్‌లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ లిండ్‌క్విస్ట్ పేర్కొన్నాడు. ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేళ యూజర్లకు ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకోవడానికి అతను పలువురు నిపుణుల బృందంతో కలిసి అధ్యయనం నిర్వహించాడు.

మల్టీ టాస్కింగ్ అసలు సమస్య కావొచ్చు

మల్టీ టాస్కింగ్ అనేది కంప్యూటర్ యూజర్ల అయోమయానికి సంబంధించిన మరొక సమస్య. ట్యాబ్‌లు వేర్వేరు కార్యకలాపాలను కలిగి ఉన్నప్పుడు ఆన్‌లైన్ గేమింగ్, రీసెర్చ్ లేదా సినిమాలు, ట్రెయిన్, రెస్టారెంట్ వంటి వివిధ టికెట్లు, రిజర్వేషన్లు బుక్ చేయడం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని నిపుణుడు లిండ్‌క్విస్ట్ కిచెన్ టేబుల్‌తో పోల్చాడు. పిల్లలకు, పెద్దలకు డైనింగ్ టేబుల్‌గా, ప్లే టేబుల్‌గా, హోంవర్క్ చేయడానికి డెస్క్‌గా ఉపయోపడే కిచెన్ టేబుల్‌లో అనేక టాస్క్‌లు పేరుకుపోతుంటాయి. పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. ప్రతీ ఒక్కటి సమర్థవంతంగా పూర్తి చేయడానికి చాలా తక్కువ సమయం ఉండటం వల్ల ఏదీ పూర్తి చేయలేకపోతారు. ఫలితంగా ఎదురయ్యేది టెన్షన్, స్ట్రెస్ మాత్రమే. మీరు కంప్యూటర్‌లో పనిచేస్తున్నప్పుడు ఓపెన్ చేసి ఉంచే ట్యాబ్‌లు కూడా ఇలాగే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. పనిలో నాణ్యత ఉండకపోవచ్చు. లేదా మరింత బెట్టర్‌గా చేయాలని అనిపిస్తుండవచ్చు. కానీ సమయం ఉండదు. ఎక్కువగా ట్యాబ్‌లు ఓపెన్ చేయకుండా ఉండగలగడమే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం.

Advertisement

Next Story

Most Viewed