- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎలన్ మస్క్ ట్విట్టర్‌కు X సింబల్ ఎందుకు? .. అసలు దీని చరిత్ర ఏమిటి?
దిశ, ఫీచర్స్: ఇక నుంచి ట్విట్టర్‌కు బ్లూ సింబల్‌కు బదులుగా X సింబల్ ఉంటుందని ఎలన్ మస్క్ ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ అక్షరంపై తెగ డిస్కషన్ జరుగుతోంది. అసలు మస్క్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? ఈ సింబల్ వెనుక చరిత్ర ఏంటి? దీనికున్న ప్రయారిటీ, అట్రాక్షన్ ఏంటి? అనే సందేహాలు పలువురిని వెంటాడుతున్నాయి. అనేకమంది ఆన్సర్ కోసం అనేక సోషల్ మీడియా వేదికల్లో, గూగుల్ సెర్చ్‌లో వెతుకున్నారు. ఇక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో X అతి తక్కువగా ఉపయోగించబడే అక్షరాలలో ఒకటి. అయినప్పటికీ ఇది అమెరికన్ కల్చర్ అంతటా కనిపిస్తుంది.
తెలియని రహస్యం వెనుక X
‘Stan Lee’s X-Men’ సూపర్ హీరోల నుంచి “The X-Files” TV సిరీస్ వరకు ఈ అక్షరం తరచుగా తెలియని ఏదో ఒక రహస్యాన్ని సూచిస్తుంది. అంతేగాక ఎలోన్ మస్క్ విత్ SpaceX, Tesla's Model X నుంచి ప్రజెంట్ ట్విట్టర్ కొత్త పేరు X వరకు ఇది అత్యంత ప్రాధాన్యతతోపాటు అట్రాక్టివ్‌గా మారిపోయింది. చాలామంది ప్రజలు, మేధావులు, సైంటిస్టులు కూడా ఎక్స్‌ను అనేక తెలియని రహస్యాలను, సాలో కాని పరిష్కారాలను వర్ణించడానికి వినియోగిస్తుంటారు. ఉదాహరణకు X అనే వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు.
X అనే వస్తువు అంటూ అనేక విషయాలకు ఎక్స్‌ను అప్లయ్ చేస్తుంటారు. కాబట్టి అది పాపులర్ అండ్ పవర్ ఫుల్ అక్షరంగా అందరిక దృష్టినీ ఆకర్షించే వాటిలో X అగ్ర భాగాన నిలిచిపోయింది. అంతేగాక మ్యాథ్స్ క్లాస్‌లో ముఖ్యంగా బీజగణిత (algebra) సమస్యలు తెలియని పరిమాణాన్ని వెల్లడించడానికి ఈ అక్షరాన్ని వేరియబుల్‌గా ఉపయోగిస్తాయి.
X పుట్టుక పరిణామం
ఆధునిక బీజగణితంలో వాడుతున్నప్పటికీ అది ఎందుకు వాడుతారో ఎవరికీ తెలియదు. కానీ ఈ χ పుట్టుకకు సంబంధించిన ఒక థియరీ ఉందని మిడిల్‌బరీలోని మ్యాథమెటిక్స్ అండ్ నేచురల్ ఫిలాసఫీ ప్రొఫెసర్ పీటర్ షుమర్ అంటున్నారు. వాస్తవానికి ఈ అక్షరం ఇస్లామిక్ మూలాల నుంచి వచ్చిందట. అరబిక్‌లో ఏదైనా కోరిన క్వాంటిటికి ఉపయోగించే పదం అల్-షాయున్ (al-shayun), అంటే ‘ఏదో’ అని అర్థం. దాని ప్రారంభం ‘sh’ శబ్దానికి సింబాలిగ్ కుదించబడింది.
అయితే స్పానిష్ పండితులు ఈ అరబిక్ గణిత గ్రంథాలను అనువదించినప్పుడు. వారికి ‘sh’ శబ్దానికి అక్షరం లేదు కాబట్టి బదులుగా "k" ధ్వనిని ఎంచుకున్నారు. అయితే దీనిని గ్రీకు అక్షరం χ ద్వారా సూచించడం స్టార్ట్ చేశారు. ఇదే క్రమంగా లాటిన్ χ గానూ మారిపోయింది. ప్రజెంట్ ప్రపంచమంతా ఈ అక్షరాన్ని సందర్భాన్ని బట్టి క్రియేటివ్, అట్రాక్టివ్ వర్డ్స్‌ను షార్ట్ కట్‌లో సూచించడానికి, అలాగే పలు తెలియని రహస్యాలను, ఉదాహరణలను వెల్లడించడానికి సింబాలిగ్‌గానూ χ ను యూజ్ చేస్తున్నారు.