- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సడెన్‌గా ఆ సింప్టమ్స్ కనిపిస్తున్నాయా?.. లోబీపీ కావచ్చు
దిశ, ఫీచర్స్ : కళ్లు, శరీరం మైకం కమ్ముతున్నట్లు అనిపిస్తోందా? శరీరం, అరచేతులు, అరికాళ్లు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? అప్పటికప్పుడే తీవ్రంగా అలసిపోయిన ఫీలింగ్ కలుగుతోందా? అయితే అది లోబీపీ కావచ్చు. ఈ పరిస్థితిలో వెంటనే ట్రీట్‌మెంట్ అందకపోతే పరిస్థితి చేయి దాటిపోవచ్చు. ఈ మధ్య కాలంలో సడెన్‌గా లోబ్లడ్ ప్రెషర్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే ఆ సమస్య పట్ల అవగాహన కలిగి ఉండటం, లక్షణాలను గుర్తించడం వంటివి తెలిస్తే జాగ్రత్త పడటం ద్వారా ప్రాణాలు దక్కించుకోవచ్చు అంటున్నారు. బాడీలో అన్ని ఆర్గాన్స్ సక్రమంగా పనిచేయాలంటే తగినంత బ్లడ్, ఆక్సిజన్ అవసరం. ఇవి సరిగ్గా అందలేని పరిస్థితుల్లో కూడా లోబీపీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
సాధారణంగా బ్లడ్ ప్రెషర్ సమస్య బాడీలోని బ్లడ్ సర్క్యూట్‌పై డిపెండ్ అయి ఉంటుంది. ఇది 120/80 mmHg గా ఉన్నప్పుడు నార్మల్ లెవల్‌గా భావిస్తారు. దీంతో ఎటువంటి సమస్య ఉండదు. శరీర భాగాలకు రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. కానీ నార్మల్ కంటే మరీ తక్కువగానో, ఎక్కువగానో మారిప్పుడే ప్రమాదం. మరీ తక్కువగా మారడాన్ని లోబీపీ లేదా హైపోటెన్షన్ అంటారు. 90/60 mmHg లేదా అంతకంటే తక్కువ లెవల్‌లో ఉంటే లోబీపీగా పరిగణిస్తారు. నిరంతర తలనొప్పి, అపస్మారక స్థితి, మెడ మీద ఒత్తిడి పెరిగి ఏదో జరుగుతున్న భావన, సడెన్‌గా బ్రీతింగ్ ప్రాబ్లమ్, బాడీ టెంపరేచర్ అకస్మాత్తుగా పెరగడం, అప్పటికప్పుడు తీవ్ర బలహీనత ఆవహించడం, కుప్పకూలిపోవడం వంటి లక్షణాలతో లోబీపీ సంభవిస్తుంది. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్, పోషకాహార లోపం, నిద్రలేమి, స్థాయికి మించిన మానసిక ఒత్తిడి వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి. కాబట్టి అటువంటి పరిస్థితులను నివారించుకోగలగాలి. సడెన్‌గా లోబీపీ సమస్య తలెత్తినప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ అందించాలి.
Read More: మగాళ్లూ.. శృంగారం చేసేటప్పుడు మీ పార్ట్‌నర్‌తో ఈ తప్పు మాత్రం చేయకండి..
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు