- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సౌందర్యానికి మించి.. మధురానుభూతినిచ్చే ‘Dopamine dressing’ స్టైల్

దిశ, ఫీచర్స్ : అందంగా ఉంటే ఆనందంగా ఉంటామనుకుంటారు కొందరు. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. అందం ఒక ఆప్షన్ లేదా అవకాశం మాత్రమే అంటున్నారు నిపుణులు. అంటే ఇక్కడ దానికి మించి మధురానుభూతిని కలిగించే అంశాలు రోజువారీ జీవితంలో అనేకం ఉంటాయి. ముఖ్యంగా స్వీయ వ్యక్తీకరణ (Self expression), స్వీయ సాధికారత (Empowerments) కూడా అలాంటివే. మానసిక ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో వార్డ్ రోబ్‌ను క్యూరేట్ చేస్తున్న ప్రతీ వ్యక్తికి ఇది ఒక్కసారైనా అనుభవంలోకి వచ్చి ఉంటుందని నిపుణులు అంటున్నారు. నచ్చిన దుస్తులను సెలెక్ట్ చేసుకోవడం, ధరించడం, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వంటివన్నీ సౌందర్యానికి మించిన మధురానుభూతికి దారితీస్తాయని చెబుతున్నారు. దీనినే ‘డోపమైన్ డ్రెస్సింగ్ ట్రెండ్’గా పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో యువతను ఆకట్టుకుంటున్న ఈ నయా పోకడలేమిటో ఇప్పుడు చూద్దాం.
‘డోపమైన్ డ్రెస్సింగ్’ నేపథ్యం
ఏ పండక్కో, ప్రత్యేక సందర్భాల్లోనో, శుభ కార్యాలకో కొత్త బట్టలు ధరించినప్పుడు పిల్లలు, పెద్దల్లో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో తెలుసు కదా.. నిజానికి ఆ సందర్భం ఆనందమయంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో కలిగే హ్యాపీనెస్ వల్ల మెదడులో ఆనందాన్ని పెంచే డోపమైన్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి దీనిని ‘డోపమైన్ డ్రెస్సింగ్ ట్రెండ్’గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అంటే మనసుకు నచ్చిన దుస్తులు ధరించడం మన మానసిక స్థితిని లేదా శ్రేయస్సును మెరుగు పరుస్తుంది. ఇక ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్ అయిన డోపమైన్ హ్యాపీనెస్ అండ్ సర్‌ప్రైజ్ భావాలతో ముడిపడి ఉన్నట్లే.. వార్డ్‌రోబ్‌లో మనసుకు నచ్చిన రంగు రంగుల దుస్తులను కలిగి ఉండటం, అవసరానికి వాటిని యూజ్ చేయడం కూడా సానుకూల భావోద్వేగాలను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయాన్ని నమ్ముతుంటారని అధ్యయనంలోనూ వెల్లడైంది. ఎందుకంటే ‘డ్రెస్సింగ్ అండ్ ఎమోషన్స్ బలంగా అనుసంధానించబడిన వాస్తవాన్ని’ వారు గుర్తిస్తారు.
కలర్స్, ప్రింటెడ్ ప్యాటర్న్స్
మీ పర్సనల్ స్టైల్‌కు అనుగుణంగా బ్రైట్ అండ్ లైవ్‌లీగా ఉండే ఉల్లాసమైన రంగులతో మీ వార్డ్‌రోబ్‌ను నింపండి. ముఖ్యంగా బోల్డ్ రెడ్, సన్నీ యెల్లో లేదా శక్తివంతమైన డైమండ్ రంగులు వంటి మీలో శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రంగులను ఎంచుకోండి. అలాగే ప్రింట్స్ అండ్ పాటర్న్స్ విషయానికి వస్తే ఇవి మీకు ఆనందాన్ని కలిగించే వాటినే ఎంచుకోండి. ముఖ్యంగా ఫ్లోరల్ ప్రింట్స్, చారలు లేదా జియోమెట్రిక్ నమూనాలు ఆనందకరమైన రంగుల ప్యాలెట్స్ తక్షణమే మీ ఉత్సాహాన్ని పెంచుతాయి.
బోల్డ్ యాక్సెసరీస్, కలర్ సైకాలజీ
కొందరికి కలర్ ఫుల్ కాంబినేషన్ నచ్చితే, మరికొందరికి నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మీరు బోల్డ్ యాక్సెసరీలను చేర్చుకోవచ్చు. వైబ్రంట్ హ్యాండ్ బ్యాగ్, ఒక జత స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ లేదా రంగురంగుల బూట్లు సింపుల్‌గా అనిపించే సరళమైన దుస్తులకు కూడా అందాన్ని జోడిస్తూ మీలో ఆనందాన్ని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే కలర్ సైకాలజీతో కూడా మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవచ్చు. అందుకోసం వివిధ రంగుల మానసిక ప్రభావాల గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. ఎరుపు రంగు శక్తికి, అభిరుచికి, పసుపు రంగు ఆనందానికి, ఆశా వాదానికి, నీలం రంగు ప్రశాంతకు నిదర్శనంగా పేర్కొంటారు. అలా మిమ్మల్ని, మీ భావోద్వేగాలను పాజిటివ్‌గా ప్రేరేపించే రంగులను ఎంచుకోవడం స్వీయ వ్యక్తీకరణతోపాటు మధురానుభూతిని కలిగిస్తాయి.
పాలెట్ పర్సనలైజేషన్ కూడా..
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని పోకడలున్నా, ముఖ సౌందర్యానికి, శారీరక సౌందర్యానికి ప్రాధాన్యత ఉన్నా మీ ఐడియల్ డోపమైన్ డ్రెస్సింగ్ వాటికి మించిన ఆనందాన్ని, సౌకర్యాన్ని, సౌందర్యాన్ని మీకు అందిస్తుందని ఫ్యాషన్ సెక్టార్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కాబట్టి మీ అందాన్ని లేదా ఆనందాన్ని రెట్టింపు చేయడంలో మీ మీరు ఆసక్తికలి ఉన్న ఆదర్శవంతమైన డోపమైన్ డ్రెస్సింగ్ పాలెట్ కచ్చితంగా ప్రత్యేకమైనది. సో.. మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా, మీకు మధురానుభూతిని కలిగించే రంగులపై శ్రద్ధ వహించడం ముఖ్యం అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. పాస్టెల్స్, జ్యువెల్ టోన్స్ లేదా ఎర్తీషేడ్స్ ఏవైనా కానివ్వండి వాటితో మీ ఇండివిడ్యువల్ స్టైల్ అండ్ ప్రిఫరెన్స్‌ను ప్రతిబింబించే వార్డ్‌రోబ్‌ను క్రియేట్ చేయడమే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే డోపమైన్ డ్రెస్సింగ్ సౌందర్య ఆకర్షణకు మించిన ఆనందాన్ని ఇస్తుంది. సానుకూల భావాలను, మానసిక శ్రేయస్సును ప్రేరేపిస్తుంది. మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఆనందాన్ని కలిగించే దుస్తులను ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవడం ద్వారా సెల్ఫ్‌లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్స్ భావాలకు దారితీస్తాయి. మీలో మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి.