అలసట, ఆందోళనను దూరం చేసే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్.. రోజూ చేయడంవల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే..

by Javid Pasha |   ( Updated:2024-03-23 14:07:56.0  )
అలసట, ఆందోళనను దూరం చేసే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్.. రోజూ చేయడంవల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే..
X

దిశ, ఫీచర్స్ : బిజీ లైఫ్ షెడ్యూల్, రెస్ట్‌ లెస్ వర్క్ స్టైల్ కారణంగా నేడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలువురిలో అలసట, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. క్రమంగా ఇతర సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం తప్పక అవసరమని నిపుణులు చెప్తుంటారు. ఎందుకంటే దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలసట, ఆందోళన దూరం అవుతాయి. అలాంటి అద్భుతమైన వ్యాయామాల్లో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ కూడా ఒకటి. శ్వాస మీద ధ్యాసతో చేసే ఈ వ్యాయామంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది

ఎటువంటి మెడిసిన్ వాడకుండానే ఆరోగ్యంగా ఉంచగలిగే చక్కటి మార్గం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. ఇది మానసిక రుగ్మతలను, ఆందోళనలను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ మనసును ప్రశాంతంగా ఉంచడంతోపాటు శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. మెదుడు చురుకుగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ కాకుండా అడ్డుకుంటాయి.

స్ట్రెస్, యాంగ్జైటీస్ తగ్గుతాయి

తరచుగా బ్రీతింగ్ ఎక్సర్‌‌సైజులు చేయడంవల్ల స్ట్రెస్, యాంగ్జైటీస్ తగ్గుతాయి. ఎందుకంటే ఇలా చేయడంవల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఇది శరీర పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందడంతో వాటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. గాలిని ఒక పద్ధతి ప్రకారం పీల్చుకోవడం, వదలడం, కంట్రోల్ చేయడం ప్రాక్టీస్ చేసే సమయంలో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి, రిలాక్స్‌గా అనిపిస్తుంది.

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

బ్రీతింగ్ ఎక్సర్ సైజులతో రీరంలో వాపు, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక ప్రతి స్పందనలో కీలక పాత్ర పోషించే తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో వివిధ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే శ్వాస పీల్చడం వదలడం అనే ప్రక్రియలో జీర్ణక్రియను కూడా మెరుగు పడుతుంది. కండరాలు గట్టి పడటం, నొప్పి కలగడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వారిలో అన్ని శరీర వ్యవస్థలు చురుకుగా పనిచేస్తాయి. కాబట్టి అనారోగ్యాలను దూరం చేస్తాయి.

Read More : అలసట, ఆందోళనను దూరం చేసే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్.. రోజూ చేయడంవల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే..

Advertisement

Next Story