Walking vs jogging : వాకింగ్.. జాగింగ్.. ఏది బెటర్?

by Javid Pasha |   ( Updated:2025-01-21 13:31:25.0  )
Walking vs jogging : వాకింగ్.. జాగింగ్.. ఏది బెటర్?
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే.. డైలీ ఏదో ఒక వ్యాయామం చేయాల్సిందే. ఇది ఫిజికల్ హెల్త్‌కు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికీ మంచిది. దీంతో ఎవరికి ఆసక్తి ఉన్నది వాళ్లు చేస్తుంటారు. కొందరు కేవలం వాకింగ్ చేస్తే, మరి కొందరు జాగింగ్ చేస్తుంటారు. ఇంకొందరు రకరకాల వర్కౌట్లు ట్రై చేస్తుంటారు. వారంలో కనీసం 5 రోజులైనా రోజుకు 30 నిమిషాల శారీరక శ్రమ లేదా వ్యాయామం తప్పక చేయాలని ఫిట్‌నెస్ అండ్ పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు.

వ్యాయామాల్లోనూ హెవీ వర్కౌట్స్, తేలికైన వ్యాయామాలు ఉంటాయి. అన్ని వయస్సులవారు తమ ఆసక్తిని బట్టి ఎంచుకోవచ్చు. అయితే చాలామందికి వాకింగ్, జాగింగ్ ఈ రెండింటిలో ఏది మంచిది? అనే సందేహం తరచుగా వస్తూ ఉంటుంది. ఈ రెండూ ఒకే తరహాకు చెందిన వ్యాయామాలు అయినప్పటికీ జాగింగ్ సాధారణంకంటే కాస్త వేగంగా నడవడం, అన్ని ఇది రన్నింగ్ కంటే తక్కువ, నడకకంటే ఎక్కువ స్పీడ్‌తో ఉంటుంది. ఇక రెండింటిలో ఏది మంచిది అంటే.. రెండూ మంచివే. అయితే వాకింగ్ కంటే జాగింగ్ చేయడంవల్ల ఎక్కువల కేలరీలు ఖర్చవుతాయి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌తోపాటు అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాబట్టి వయసును బట్టి, ఓపికను బట్టి నిర్ణయం తీసుకోవాలి. చేయగలిగే పరిస్థితి ఉంటే వాకింగ్ కంటే జాగింగ్ వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది.

వాకింగ్ 30 నిమిషాలు చేస్తే 100కుపైగా కేలరీలు ఖర్చవుతాయి. అదే జాగింగ్ 30 నిమిషాలు చేస్తే 200 కేలరీలు ఖర్చవుతాయి. రెండూ మంచివే అయినప్పటికీ జాగింగ్ వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కీళ్లు, మోకాళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు ఉన్నవారు జాగింగ్ చేయవద్దు. దీనికంటే వాకింగ్ చేయడమే బెటర్. అంటే ఇక్కడ మీ వయసును, ఆరోగ్యాన్ని బట్టి కూడా ఏ వ్యాయామం బెటరో నిర్ణయం తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed